హసీనాపై ఒత్తిడి వద్దు- అమెరికాకు ఇండియా విజ్ఞప్తి!
బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా పట్ల చూసీ చూడనట్లు వ్యవహరించాలని భారత అధికారులు అమెరికన్ విదేశీ వ్యవహారాల శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారని ‘బిజినెస్ టుడే’ పత్రిక వెల్లడి చేసింది. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి ఇండియాకు పారిపోవటానికి సంవత్సరం ముందు నుండే ఇండియా, హసీనా పట్ల తేలికగా వ్యవహరించాలని, అమెరికాను కోరిందని ది వాషింగ్టన్ పోస్ట్ పత్రికను ఉటంకిస్తూ బిజినెస్ టుడే పత్రిక వెల్లడి చేసింది. బంగ్లాదేశ్ లోని హసీనా ప్రభుత్వం…

