2జి స్పెక్ట్రమ్ కుంభకోణం: కేంద్ర మంత్రి దయానిధి మారన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

సి.బి.ఐ ని తనపని తనను చేసుకోనిస్తే తగిన ఫలితాలను చూపించగల సత్తా ఉన్న సంస్ధ అని నిరూపించుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ నుండి సి.బి.ఐ ని తాత్కాలికంగా తప్పించి సుప్రీం కోర్టు పర్యవేక్షణలో పని చేస్తున్నందున ఒక్కో తీగా లాగుతూ అనేక డొంకల్ని కదిలిస్తోంది. సి.బి.ఐ బుధవారం సుప్రీం కోర్టుకి సమర్పించిన ‘స్టేటస్ రిపోర్ట్’ లో ప్రస్తుతం కేంద్రంలో టెక్స్ టైల్స్ శాఖ మంత్రిగా ఉన్న దయానిధి మారన్ అఘాయిత్యాన్ని పొందుపరిచింది. మలేషియా కంపెనీకి మేలు చేయడానికీ,…

మే నెలలో 111 శాతం పెరిగిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు

2011-12 ఆర్ధిక సంవత్సరంలో మే నెలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్.డి.ఐ) 111 శాతం పెరిగాయని ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఒక్క మే నెలలోనే ఎఫ్.డి.ఐ లు 4.66 బిలియన్ డాలర్లు దేశంలోకి వచ్చాయని ప్రభుత్వం సంబరంగా ప్రకటించింది. ఇది గత ఆర్ధిక సంవత్సరంలో మే నెలలో వచ్చిన 2.21 బిలియన్ డాలర్ల ఎఫ్.డి.ఐ లతో పోలిస్తే 111 శాతం అధికమని ప్రభుత్వం తెలిపింది. అంతే కాక గత 11 సంవత్సరాల్లో రెండవ అతి పెద్ద మొత్తం…

భారత దేశానికి ఆయిల్ సరఫరాలో ఆటంకాలు రానివ్వం -ఇరాన్

భారత దేశ ఆయిల్ రిఫైనరీలు పాత బాకీలు చెల్లించనట్లయితే వాటికి ఆయిల్ సరఫరాను ఆగష్టు నెలనుండి బంద్ చేస్తామని ప్రకటించిన ఇరానియన్ ప్రభుత్వ ఆయిల్ కంపెనీ “నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీ” (ఎన్.ఐ.ఒ.సి), భారత దేశానికి సరఫరా చేయడంలో ఆటంకాలు రానివ్వబోమని ప్రకటించింది. ఇండియా ఆయిల్ రిఫైనరీలు తమకు 2 బిలియన్ డాలర్లు బకాయి ఉన్నాయనీ అది చెల్లించడానికి తగిన మార్గాన్ని త్వరగా చూపనట్లయితే ఆయిల్ సరఫరా ఆపడం తప్ప మరొక మార్గం లేదని ఎన్.ఐ.ఒ.సి ప్రకటించిన…

ఫుకుషిమా అణు ప్రమాదాన్ని తక్కువ చేసి చూపడానికి బ్రిటిష్ అధికారుల రహస్య ప్రయత్నాలు

బహుళజాతి కంపెనీలు, వారితో కుమ్మక్కైన ప్రభుత్వాలు ప్రజలను మోసం చేయడానికి, వారికి సరైన సమాచారం అందకుండా చుడ్డానికి ఎంతకైనా తెగిస్తారు. అది ఇండియా కావచ్చు, అమెరికా కావచ్చు లేదా బ్రిటన్ కావచ్చు. ప్రజల భవిష్యత్తు నాశనమైపోయినా సరే వారికి మాత్రం లాభాలు నిరంతరాయంగా వస్తూ ఉండవలసిందే. ఫుకుషిమా దైచి అణు ప్రమాదం వలన కొత్తగా నెలకొల్పే న్యూక్లియర్ కర్మాగారాలను ప్రజలు వ్యతిరేకిస్తారని భయపడిన బ్రిటిష్ అధీకారులు ఆ ప్రమాదం వలన ఏర్పడపోయే ప్రతికూల పరిణామాలను తక్కువ చేసి…

ఇండియా పశుదాణా ఎగుమతుల్లో ప్రమాదకరమైన రసాయనం -చైనా హెచ్చరిక

ఇండియా నుండి ఎగుమతి అవుతున్న పశువుల దాణాలో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయని చైనా క్వాలిటీ విభాగం హెచ్చరించింది. చైనా ఆరోపణలను అధ్యయనం చేస్తున్నట్లు సాల్వెంట్స్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కార్యనిర్వాహక డైరెక్టర్ బి.వి మెహతా చెప్పినట్లుగా వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక తెలిపింది. ప్రమాదకరమైన రసాయనం “మాలఖైట్ గ్రీన్” భారతదేశం నుండి దిగుమతి అయిన ‘రేప్ గింజల గానుగ పిండి’ (rapeseed meal – రేప్ గింజల నుండి నూనె తీయగా మిగిలే పిప్పి) లో కనుగొన్నామని…

ధాన్యం ఎగుమతికి పచ్చ జెండా ఊపిన కేంద్రం?

ధాన్యం ఎగుమతికి కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపిందని వాల్‌స్ట్రీట్ జర్నల్పత్రిక రాసింది. గోదాముల్లో ఖాళీ లేక ఆరుబైట నిలవ చేయవలసి వస్తున్నదనీ, ఆరుబైట ఉంచడంతో ఎండా వానలకు చెడిపోతున్నాయనీ చెబుతూ కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి శరద్ పవార్ దాదాపు సంవత్సరం నుండీ ఎగుమతి చేద్దాం అని పోరుతూ వచ్చాడు. మిల్లర్లతో ఉన్న గాఢమైన అనుబంధం ఆయన్ను దేశంలో జనాలకి ధాన్యం అవసరం ఉందన్న స్పృహ కంటే విదేశాల్లో ధరలు ఎక్కువగా ఉన్నాయి, ఎగుమతులకు ఇదే…

“పౌర అణు ఒప్పందం” విషయంలో అమెరికా, ఇండియాను మోసగించనున్నదా?

2008 సంవత్సరంలో అమెరికా, ఇండియాలు “పౌర అణు ఒప్పందం” పై సంతకాలు చేశాయి. ఆ ఒప్పందం ద్వారా అప్పటివరకు అణు విషయాల్లో ప్రపంచంలో ఏకాకిగా ఉన్న ఇండియా అణు వ్యాపారంలో భాగస్వామ్యం పొందడానికి అమెరికా వీలు కల్పించిందని అంతర్జాతీయ కార్పొరేట్ పత్రికా సంస్ధలు వార్తలు రాశాయి. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై ఇండియా సంతకం చేయనప్పటికీ అణు వ్యాపారం చేయడానికి ఇండియాకి అవసరమైన అణు పరికరాలు అమ్మడానికీ మినహాయింపు లభించిందని నిపుణులు వ్యాఖ్యానించారు. ఇది అరుదైన విషయమనీ…

త్వరగా సంస్కరణలు ఆమోదించండి, మాకోసం మీ మార్కెట్లు పూర్తిగా తెరవండి -అమెరికా

ఇండియా సంస్కరణల అమలు వేగవంతం చెయ్యాలనీ, తద్వారా భారత మార్కెట్లను అమెరికా ప్రవేశించడానికి వీలుగా మరింత బార్లా గేటులు తెరవాలని అమెరికా కోరింది. అమెరికా ట్రెజరీ సెక్రటరీ తిమోతి గీధనర్ వాషింగ్టన్‌లో జరుగుతున్న ఇండియా అమెరికా బిజినెస్ ఫోరంలో మాట్లాడుతూ ఇండియా ఫైనాన్షియల్ మార్కెట్‌ను బాగా అభివృద్ధి చేసుకుందని సర్టిఫికెట్ ఇచ్చాడు. మరిన్ని సంస్కరణలు ప్రవేశ పెట్టినట్లయితే ఇండియాలో కాపిటల్ మార్కెట్లు అభివృద్ధి చెంది అమెరికా కంపెనీలు స్వేచ్ఛగా ప్రవేశించడానికి వీలు కలుగుతుందని గీధనర్ తెలిపాడు. సమావేశానికి…

ఇంగ్లండు పర్యటనలో చైనా ప్రధాని, వ్యాపారం పెంపుకు హామీ

ఐదు రోజుల పర్యటన నిమిత్తం యూరప్ వచ్చిన చైనా ప్రధాని వెన్ జియాహావో సోమవారం నుండి ఇంగ్లండు లో పర్యటిస్తున్నాడు. తన పర్యటన సందర్భంగా వెన్ “ఇంగ్లండుతో ద్వైపాక్షిక వ్యాపారం మరింతగా పెంచడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించాడు. మరిన్ని బ్రిటన్ ఉత్పత్తులు చైనాకు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఇంగ్లండులోని చైనా కార్ల కంపెనీ ఎం.జి కార్ ప్లాంటు తయారు చేస్తున్న మోడల్‌ని మరిన్ని ఎంటర్‌ప్రైజ్‌లు ఆధారంగా చేసుకోవాలన్న ఆకాంక్షను వ్యక్తపరిచాడు. సంక్షోభంలో యూరోజోన్ దేశాలకు మద్దతు కొనసాగిస్తామని…

యూరప్‌లో విస్తరిస్తున్న చైనా ప్రాబల్యం

యూరప్‌లో చైనా వ్యాపారాలు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే ఆఫ్రికా, లాటిన్ అమెరికా లలో విస్తారమైన సహజ వనరులను వెలిలి తీయడంలోనూ, వెలికి తీసిన వనరులలో అధిక భాగాన్ని చైనాకి తరలించుకు వెళ్ళడంలోనూ చైనా చురుకుగా వ్యవహరిస్తోంది. అలాగే యూరప్‌లో సైతం చైనా తన ప్రాబల్యాన్ని విస్తరించుకుంటోంది. చైనా కంపెనీలు యూరప్‌లో కార్యకలాపాలను నిర్వహించడం పెరిగింది. చైనా వద్ద అత్యధిక మొత్తంలో నిలవ ఉన్న విదేశీమారక ద్రవ్యం తమ దేశాల్లో పెట్టుబడిగా పెట్టాలని ఇంగ్లండ్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు…

గూగుల్‌పై యాంటీ-ట్రస్ట్ కేసు నమోదు చేస్తాం -అమెరికా ఎఫ్.టి.సి

యాంటీట్రస్ట్ చట్టం కింద గూగుల్ నేరానికి పాల్పడినట్లుగా అమెరికా “ఫెడరల్ ట్రేడ్ కమిషన్” భావిస్తోంది. ఈ చట్టం కింద గూగుల్‌పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించడానికి నిర్ణయించినట్లు ఎఫ్.టి.సి తెలిపింది. మరికొద్ది రోజుల్లో గూగుల్‌కి కోర్టు ఆర్డర్లు అందనున్నాయి. తన సెర్చి ఇంజన్ వ్యాపారం ద్వారా తన వెబ్‌సైట్లకు, తాను అందిస్తున్న ఇంటర్నెట్ సేవలకు వినియోగదారులను ఆకర్షిస్తున్నదని గూగుల్ పై అనేక ఇంటర్నెట్ సంస్ధలు చాలా కాలం నుండి ఆరోపణలు చేస్తున్నాయి. ఈ ఆరోపణల నేపధ్యంలో…

గ్లోబల్ ఆయిల్ ధరల తగ్గుదల ప్రజలకు అందకుండా అడ్డుపడుతున్న భారత ప్రభుత్వం

భారత ప్రభుత్వం సంవత్సరం క్రితం పెట్రోల్ ధరలను డీకంట్రోల్ చేసింది. అంటే పెట్రోల్ ధరలపై ప్రభుత్వ నియంత్రణను ఎత్తివేసింది. ఫలితంగా గ్లోబల్ మార్కెట్‌లో ఆయిల్ ధరలు పెరిగినప్పుడల్లా పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. డీకంట్రోల్ చేశాక ఇప్పటివరకు పెట్రోల్ ధర 23 శాతం పెరిగింది. ప్రభుత్వం ఇంతకుముందు సబ్సిడీ రూపంలో ఆయిల్ ధరలో కొంత భారం భరించడం వలన ప్రజలకు ప్రభుత్వం భరించినంతమేరకు తక్కువ ధరకు ప్రజలకు ఆయిల్ లభించేది. నిజానికి పెట్రోల్‌ను దిగుమతి ధరలకే ప్రజలకు ఇచ్చినట్లయితే…

“న్యాయం కోసం నేలపై పడుకున్నాం,” పిల్లలు చూపుతున్న పోరు దారి -ఫోటోలు

పోస్కో: దక్షిణ కొరియాకి చెందిన బహుళజాతి సంస్ధ. ఐదేళ్ళనుండి ఒడిషాలోని ఐదు గ్రామాల ప్రజల బతుకులపై కొట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ముడుపులు మెక్కి కొందరు, ప్రపంచ పెట్టుబడికి సలాం కొట్టి మరికొందరు, భారత పాలకులే ఈ ప్రజల పాలిట యమదూత లయ్యారు. తమలపాకు తోటలపై ఆధారపడి కుంటుతూనే గడుపుతున్న వీరి జీవితాల్లోకి విషం పోశారు. రు.50,000 కోట్ల విదేశీ పెట్టుబడికి సలాం కొట్టిన మన్మోహన్, నవీన్‌లు  తమకు ఓట్లేసిన గ్రామీణుల నోట్లో మట్టి కొట్టారు. తమలపాకు తోటల్ని…

డాట్ కామ్, డాట్ ఓఅర్‌జి ల ఆధిపత్యానికి ఇక చెల్లు చీటీ, డొమెయిన్ నేమ్ ఏదైనా ఓకే

ఇంటర్నెట్ లో డొమెయిన్ నేమ్‌ల పూర్వ పదాలుగా ఇప్పుడు పరిమితంగానే ఉన్నాయి. డాట్ కామ్, డాట్ ఒఆర్‌జి, డాట్ ఇన్ఫో (.com, .org, .info etc…) తదితరాలతో పాటు ఆయా దేశాలను సూచించే పదాలు మాత్రమే డొమెయిన్ నేమ్ లో చివరి పదాలుగా ఉండాలన్న నిబంధన ఉంది. అవి తప్ప ఇతర పదాలను రిజిష్టర్ చేసుకునే సౌకర్యం ఇంతవరకూ లేదు. అయితే 2012 సంవత్సరం నుండీ ఈ పరిమితికి స్వస్తి పలకడానికి అంతర్జాతీయ ఇంటర్జెట్ నియంత్రణా సంస్ధ…

మెరుగైన సేవలు కావాలంటే ప్రైవేటు కంపెనీలకి పట్టణ ప్రజలు మరింత చెల్లించుకోవాల్సిందే -కేంద్ర మంత్రి

భారత దేశ ప్రజలకు ఇప్పటివరకూ అన్నీ ఉచితంగా వాడుకోవడం అలవాటయ్యిందనీ, కానీ రోడ్లు, నీరు, విద్యుత్ లాంటి సేవలు మెరుగుపడాలంటే మరింతగా చెల్లించడానికి సిద్ధమైతే తప్ప సాధ్యం కాదనీ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కమల్ నాధ్ తెగేసి చెబుతున్నాడు. రాయిటర్స్ వార్తా సంస్ధకి నాలుగు రోజుల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పట్టణాల్లొ సేవలను మెరుగుపరచడం కోసం ఇప్పటివరకూ ప్రభుత్వం ఒక్కటే బాధ్యత తీసుకున్నదనీ, ఇకనుండి ప్రైవేటు కంపెనీలకు పట్టణాల్లో మౌలిక సౌకర్యాల నిర్మాణానికి భాగస్వామ్యం…