ఎన్.డి.ఎ వంద శాతం ఎఫ్.డి.ఐ రిటైల్ రంగంలో రావాలని ప్రతిపాదించింది కదా -మంత్రి
ఎన్.డి.ఎ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు రిటైల్ రంగంలోకి వంద శాతం పెట్టుబడుల రావాలని ప్రతిపాదించిందని కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ గుర్తు చేశాడు. యు.పి.ఎ ప్రభుత్వం అప్పటినుండి అనేక చర్చోప చర్చలు సాగించి కేవలం 51 శాతం మాత్రమే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు రిటైల్ రంగంలోకి అనుమతించాలని ఖుర్షీద్ తెలిపాడు. “రిటైల్ రంగంలోకి విదేశీ పెట్టుబడులను అనుమతించే నిర్ణయం తీసుకునే ముందు మేము అనేక రకాలుగా ఆలోచించాం. ఎన్.డి.ఎ ప్రభుత్వం ప్రతిపాదించినప్పటినుండీ అనేక విధాలుగా ఈ విషయమై…
