‘ఉపాధి హామీ పధకం’ కి బడ్జెట్ లో నిధుల కత్తిరింపు
ఓట్ల కోసమే తప్ప తమకు ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ ప్రభుత్వం రుజువు చేసుకుంది. ప్రజా సంక్షేమం చూసే పార్టీగా చెప్పుకోవడానికి కాంగ్రెస్ ప్రముఖంగా చూపించే పధకం ‘ఉపాధి హామీ పధకం’. ఈ పధకం వల్లనే కాంగ్రెస్ పార్టీ రెండవ సారి వరుసగా అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ నాయకులు అనేకసార్లు చెప్పారు. దీనిని సోనియా గాంధీ ప్రసాదించిన వరంగా కూడా కాంగ్రెస్ పెద్దలు చెప్పుకోవడం కద్దు. అలాంటి పధకానికి 2012-13 ఆర్ధిక సంవత్సరానికి ప్రతిపాదించిన…
