ఎన్నికల బడ్జెట్ -కార్టూన్

లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలనే బైపాస్ రోడ్లుగా వేసుకుంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని యు.పి.ఎ ప్రభుత్వం పదేళ్ళ పాలన పూర్తి చేసుకుంది. విదేశీ మాస్టర్లు, స్వపార్టీ నాయకుల ఆదేశాలను కిమ్మనకుండా పాటించే హార్వర్డ్ మర మనిషి యు.పి.ఎ డ్రైవర్ గా తనకు అప్పజెప్పిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించారు. ఇచ్చిన ఆదేశాలను పొల్లుపోకుండా ఎంత ఖచ్చితంగా అమలు చేస్తే మర మనిషి అంత సమర్ధవంతంగా పని చేసినట్లన్నది లోకోక్తిగా మార్చడంలోనూ మన మరమనిషి సఫలం అయ్యారు. ఇక చివరి బడ్జెట్…

ప్రశ్న: వోట్-ఆన్-అకౌంట్ అంటే?

ప్రశ్న (మల్లిఖార్జున్): సాధారణ బడ్జెట్ కీ, వోట్-ఆన్ అకౌంట్ బడ్జెట్ కీ తేడా చెప్పండి? సమాధానం: క్లుప్తంగా చెప్పాలంటే తాత్కాలికంగా ఖర్చులు గడుపుకోవడానికి ప్రతిపాదించే బడ్జెట్ నే వోట్-ఆన్-అకౌంట్ అంటారు. సాధారణంగా ఎన్నికల సంవత్సరంలో వోట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ అవసరం వస్తుంది. పూర్తి స్ధాయి సాధారణ బడ్జెట్ ఆమోదించాలంటే సభల్లో సంతృప్తికరంగా చర్చలు జరగాలి. ఈ చర్చలన్నీ ముగియాలంటే సమయం తీసుకుంటుంది. కొత్త బడ్జెట్ సంవత్సరం వచ్చేస్తుంది. ఈ లోపు ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావచ్చు. పాత ప్రభుత్వం పూర్తి…