వేశ్యలు ప్రతీఘాత ఉదాహరణలు కారు -చర్చ

గత ఆర్టికల్ –మహిషాసురుడు సభకు ఎందుకు వచ్చాడు?– కింద వెంకట్ గారి చర్చకు సమాధానంగా ఈ వ్యాసాన్ని చూడగలరు -విశేఖర్) —————– ఒకటి: సెక్స్ వర్కర్స్ కూడా మనుషులే. వాళ్లేమీ ఇష్టం ఉండి ఆ పని చేయరు. వారి శరీరాలతో వ్యాపారం చేసే వాళ్ళు అధికార వ్యవస్ధలోనే తిష్ట వేసుకుని ఉంటారు. లేదా అధికారంలోని పెద్దల అండదండలతోనే స్త్రీల శరీరాలతో వ్యాపారం జరుగుతోంది. అక్రమ సంపాదనలు, సంపదలు పెరగడం కోసం యువతుల్ని, బాలికల్ని పలు రకాలుగా మోసం…

వేశ్యల మానవ హక్కుల ఉల్లంఘనలను నిరసిస్తూ పెదవులు కలిపి కుట్టుకున్న మహిళ -ఫోటో

జూన్ 15 న బొలీవియాలో చోటు చేసుకున్న దృశ్యం ఇది. తమ మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నందుకు నిరసనగా అక్కడి వేశ్యలు, మహిళా వెయిటర్లు, వేశ్యా గృహాల ఓనర్లూ ఈ విధంగా పెదవులు కలిపి కుట్టుకుని నిరసనకు పాల్పడ్డారు. రాయిటర్స్ వార్తా సంస్ధ ఈ ఫోటోను ప్రచురించింది. బోలీవియాలోని “లా పాజ్” నగరంలో ఈ నిరసనలో పాల్గొన్న మహిళ ఈమె వేశ్యా వృత్తిలో ఉన్నట్లుగా స్ధానిక పోలీసులు తెలిపారని రాయిటర్స్ తెలిపింది.