తెలంగాణ రాష్ట్రం కోరడం వేర్పాటువాదం కాదు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరడాన్ని వేర్పాటువాదంగా కొంతమంది సంభోదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వేరుపడాలని కోరుతున్నారు గనక అది ‘వేర్పాటు వాదమే’ అని వారి వాదనగా ఉంది. వాస్తవానికి భారత రాజ్యాంగం ప్రకారం చూసినా ఒక రాష్ట్రం నుండి విడిపోయి కొత్త రాష్ట్రంగా ఏర్పడడం వేర్పాటు వాదం కాజాలదు. దేశం నుండి విడిపోయి కొత్త దేశంగా ఏర్పడాలని కోరుకోవడం వేర్పాటువాదం అవుతుంది తప్ప రాష్ట్రాలుగా విడిపోవడం వేర్పాటువాదం కాదు. కాశ్మీరు ప్రజలు తమది ప్రత్యేక…