వూల్ విక్ హంతకుడికి ఎం.ఐ-5 జాబ్, ఒక పరిశీలన

పశ్చిమ దేశాల మిలట్రీ గూఢచార సంస్ధలు టెర్రరిస్టులతో నిత్యం సంబంధం కలిగి ఉంటాయన్న వాస్తవాన్ని వూల్ విక్ హత్యోదంతం మరొకసారి వెలుగులోకి తెచ్చింది. పశ్చిమ దేశాలకు ఇస్లామిక్ టెర్రరిజం వ్యూహాత్మక మిత్రుడే కానీ శత్రువు కాదని అంతర్జాతీయ పరిశీలకులు ఎప్పుడూ చెప్పే మాట. లండన్ వీధుల్లో జరిగిన హత్య, అనంతరం వెల్లడి అవుతున్న విషయాలు ఈ సంగతిని ధృవీకరిస్తున్నాయి. లండన్ లోని వూల్ విక్ సబర్బ్ లో ఒక మిలట్రీ డ్రమ్మర్ ను పాశవికంగా చంపాడని బ్రిటిష్…