బ్రిటిష్ రాణి డైమండ్ జూబ్లీ పండగలో బ్యాంక్సీ? -వీధి చిత్రం

బ్రిటిష్ రాణి ఎలిజబెత్ II సింహాసనాన్ని చేపట్టి ఈ సంవత్సరం ఫిబ్రవరి 6 తో అరవై యేళ్లు పూర్తి కావస్తున్నాయట. ఈ సందర్భంగా బ్రిటన్ ప్రభుత్వం ప్రపంచ వ్యాపితంగా పండగ జరుపాలని తలపెట్టింది. గత కొద్ది నెలలుగా ఎక్కడా కొత్తగా బ్యాంక్సీ వీధి చిత్రం జాడలేదు. నార్త్ లండన్ లో ప్రత్యక్షమైన ఈ వీధి చిత్రంతో బ్రిటిష్ రాణి అరవై యేళ్ల పండగని ఈ విధంగా బ్యాంక్సీ జరపుకున్నాడని ఔత్సాహికులు వ్యాఖ్యానిస్తున్నారు. రాణి గారి అరవై యేళ్ల…

సునిశిత హాస్యం ఈ గీతల సొంతం -స్ట్రీట్ ఆర్ట్ ఫొటోలు

ఈ వీధి చిత్రాల్లో కళాకారులు పెద్దగా కష్ట పడినట్లు కనిపించదు. సహజ సిద్ధంగా ఏర్పడిన కొన్ని గీతలనీ, రోజువారీ ఉపయోగం కోసం ఏర్పాటు చేసుకున్న కొన్ని నిర్మాణాలనూ, ఉపకరణాలనూ ఆధారం చేసుకుని వారు అర్ధవంతమైన చిత్రాలు రాబట్టారు. తరచుగా ఈ చిత్రాల్లో కేవలం కొన్ని గీతలో, కొంత పాఠ్యమో, మహా అయితే రోజూ చూసే చిన్న చిన్న బొమ్మలో కనిపిస్తాయంతే. ఇలాంటి వీధి చిత్రాలు సృష్టించడంలో బ్యాంక్సీ (ఇంగ్లండ్) సిద్ధహస్తుడు. ఓక్ ఓక్ (ఫ్రాన్సు) కూడా. వీరద్దరు…

ఇంకొన్ని యూరోపియన్ వీధి చిత్రాలు -ఫొటోలు

యూరోపియన్ వీధి చిత్రాల్లో కనిపిస్తున్న త్రీ డైమెన్షనల్ ఎఫెక్టు చాలా అబ్బురపరిచే విధంగా ఉంటోంది. ఉదాహరణకి కింది ఫొటోల్లో ఎనిమిదవ ఫొటో చూడండి. ఆ బొమ్మ నిజానికి నేలపైన గీసిందే. బొమ్మ చివర స్త్రీ కూర్చుని ఉంది. కానీ చూస్తుంటే పులి నిజాంగా నిల్చుని ఉన్నట్లూ, స్త్రీ ఆ పులిపైన కూర్చుని ఉన్నట్లూ కనిపిస్తోంది. అలాగే పదకొండవ ఫొటో కూడా. ఇది నిజానికి సింపుల్ గా కనిపిస్తున్నప్పటికీ త్రీ-డి ఎఫెక్టు ఎలా వచ్చిందన్నదీ ఓ పట్టాన అర్ధం…