అమెరికాలో కార్మికుల హక్కులపై దాడికి వ్యతిరేకంగా ఈజిప్టు తరహా ఉద్యమం
అమెరికాలో విస్ కాన్సిన్ రాష్ట్రంలో ఈజిప్టు తరహాలో కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నర్సులు మొదలయిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ మూడు వారాలనుండీ ఉద్యమం నిర్వహిస్తున్నప్పటికీ పశ్చిమ దేశాల వార్తా సంస్ధలు అక్కడ ఏమీ జరగనట్లుగా నాల్రోజుల క్రితం వరకూ నటిస్తూ వచ్చాయి. ప్రపంచ ఆర్ధిక సంక్షోభానికి ప్రత్యక్షంగా కారణమైన అమెరికాలోని ప్రైవేటు బహుళజాతి గుత్త సంస్ధలపై చర్య తీసుకోవటం అటుంచి ‘స్టిములస్ ప్యాకేజీ’ పేరుతో రెండు ట్రిలియన్లకు పైగా ప్రజల సొమ్మును వాటికి ధారపోసిన సంగతి…