ఇండియా పశుదాణా ఎగుమతుల్లో ప్రమాదకరమైన రసాయనం -చైనా హెచ్చరిక
ఇండియా నుండి ఎగుమతి అవుతున్న పశువుల దాణాలో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయని చైనా క్వాలిటీ విభాగం హెచ్చరించింది. చైనా ఆరోపణలను అధ్యయనం చేస్తున్నట్లు సాల్వెంట్స్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కార్యనిర్వాహక డైరెక్టర్ బి.వి మెహతా చెప్పినట్లుగా వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక తెలిపింది. ప్రమాదకరమైన రసాయనం “మాలఖైట్ గ్రీన్” భారతదేశం నుండి దిగుమతి అయిన ‘రేప్ గింజల గానుగ పిండి’ (rapeseed meal – రేప్ గింజల నుండి నూనె తీయగా మిగిలే పిప్పి) లో కనుగొన్నామని…