డీఎంకే సహకారంతో పళనిస్వామి విశ్వాస తీర్మానం గెలుపు

శశికళ ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిన ఈపిఎస్ (E పళనిస్వామి) విశ్వాస తీర్మానం నెగ్గాడు. ‘న్యాయం గెలుస్తుంది. మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం’ అంటూ బింకం ప్రదర్శించిన ఓపిఎస్ చివరికి బిక్క మొహం వేశాడు. ఈపిఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా 122 మంది ఎంఎల్ఏ లు ఓటు వేయగా వ్యతిరేకంగా కేవలం 11 మంది ఎంఎల్ఏలు మాత్రమే ఓటు వేశారు. జయలలిత ఓటు లేదు కనుక ప్రభుత్వ ఏర్పాటుకు 117 మంది ఎంఎల్ఏలు మద్దతు చాలు.      …

పార్లమెంటు విశ్వాస పరీక్షలో ‘ఓటుకు నోట్లు’ కేసు దర్యాప్తుపై సుప్రీం కోర్టు ఆగ్రహం

2008 సంవత్సరంలో పార్లమెంటు విశ్వాసం పొందడం కోసం యు.పి.ఎ – 1 ప్రభుత్వం డబ్బులిచ్చి ప్రతిపక్షాల ఓట్లు కొన్న కేసులో దర్యాప్తు కొనసాగుతున్న తీరు పట్ల సుప్రీం కోర్టు శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు సంవత్సరాల నుండి కేసు విచారణలో పురోగతి లేకపోవడంతో ఢిల్లీ పోలీసుల పనితీరుపై అసహనం వ్యక్తం చేసింది. “ఢిల్లీ పోలీసులు చేసిన దర్యాప్తు పట్ల మేము ఏ మాత్రం సంతోషంగా లేము. ఇటువంటి తీవ్రమైన నేరంతో కూడిన అంశంలో, నేరం…

వికీలీక్స్ ను నమ్మలేం -ప్రధాని మన్మోహన్

యు.పి.ఏ – 1 ప్రభుత్వం 2008 సంవత్సరంలో విశ్వాస పరీక్ష నెగ్గడానికి లంచాలు ఇచ్చిందన్న ఆరోపణను భారత ప్రధాని మన్మోహన్ తిరస్కరించాడు. మా ప్రభుత్వం లో ఎవరూ ఆ సమయంలో అనైతిక కార్యకలాపాలకు పాల్పడలేదని ఆయన పార్లమెంటుకు చెప్పాడు. ప్రతిపక్షాలు “ఊహాత్మక, నిర్ధారించని, నిర్ధారించలేని” ఆధరాలతో ఆరోపణలు చేస్తున్నాయని సభకు తెలిపాడు. గురువారం సభలో జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ మన్మోహన్ “వికీలీక్స్” సంస్ధ నమ్మదగినది కాద”ని అన్నాడు. “అసలు వికీలీక్స్ ఉనికినే ప్రభుత్వం గుర్తించడం లేదని…