జర్నలిస్టు హత్యలో ఐ.ఎస్.ఐ హస్తం లేదు -పాక్ ప్రభుత్వం
ఏసియా టైమ్స్ విలేఖరి సయ్యద్ సలీమ్ షహజాద్ హత్యలో పాక్ గూఢచార సంస్ధ ఐ.ఎస్.ఐ హస్తం ఉందనడాన్ని పాకిస్ధాన్ ప్రభుత్వం తిరస్కరించింది. రహస్య గూఢచర్య సమాచారం విలేఖరి హత్యలో ఐ.ఎస్.ఐ ప్రత్యక్ష జోక్యం ఉందని నిరూపిస్తున్నట్లుగా వచ్చిన వార్తలను పాక్ ఖండించింది. పాకిస్ధాన్ భద్రతా బలగాల పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికే జరుగుతున్న అంతర్జాతీయ కుట్రలో భాగమే ఈ కధనాలని ఆరోపించింది. ఐ.ఎస్.ఐ కి చెందిన సీనియర్ ఉన్నాధికారులు షహజాద్ హత్యకు పురమాయించారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక…