వియత్నాం నెత్తిన అమెరికా రుద్ధిన యుద్ధ భీభత్సం -ఫొటోలు
1962 నుండి అమెరికా దురాక్రమణ యుద్ధ భీభత్సాన్ని అతి చిన్న దేశం ‘వియత్నాం’ నెత్తిన రుద్దింది. కమ్యూనిస్టు చైనా ప్రాబల్యం వియత్నాం దేశంలోకి విస్తరిస్తుందన్న భయంతో వియత్నాం ప్రజలపై అమెరికా బలవంతంగా రుద్దిన యుద్ధం ఇది. జాతీయ విముక్తి యుద్ధాల ఫలితంగా ప్రపంచంపై యూరోపియన్ దేశాల వలసాధిపత్యం అంతరించాక అమెరికా తన సామ్రాజ్యాధిపత్యాన్ని విస్తరించడానికి అనేక దుర్మార్గ యుద్ధాలను ప్రపంచ దేశాలపై రుద్ధడం ప్రారంభించింది. అమెరికా కంపెనీల ప్రయోజనాలను ప్రపంచ వ్యాపితంగా విస్తరించడంతో పాటు, కమ్యూనిస్టు వ్యవస్ధల…

