ఆచూకీ లేని విమానం, మోగుతున్న సెల్ ఫోన్లు -ఫోటోలు
అనూహ్య పరిస్ధితుల్లో అదృశ్యం అయిన మలేషియా విమానం కోసం సముద్రం జల్లెడ పడుతున్నా ఇంకా ఫలితం దక్కలేదు. మొత్తం 10 దేశాలకు చెందిన విమానాలు, హెలికాప్టర్లు, నౌకలు గాలింపు చర్యల్లో పాలు పంచుకుంటున్నాయి. ఉద్రిక్తతలకు ఆలవాలం అయిన దక్షిణ చైనా సముద్రంలో సముద్ర జలాల హక్కులపై నెలకొన్న తగాదాలను పక్కనబెట్టి మరీ ఆయా దేశాలకు చెందిన మిలట్రీ విమానాలు, సివిల్ ఏవియేషన్ విభాగాలు, సముద్ర రక్షక బలగాలు, తీర రక్షక బలగాలు (కోస్ట్ గార్డ్) గాలింపు జరుపుతున్నాయి.…
