భూకంపం దెబ్బకి మళ్ళీ ఆర్ధిక మాంద్యంలోకి జారుకున్న జపాన్
ఊహించినంతా జరిగింది. సంవత్సరాలపాటు డిఫ్లేషన్‌తో తీసుకున్న జపాన్ ఆర్ధిక వ్యవస్ధ భూకంపం, సునామిల ధాటికి మరోసారి ఆర్ధిక మాంద్యం (రిసెషన్) లోకి జారిపోయింది. వినియోగదారుల డిమాండ్ ఘోరంగా పడిపోవడం, రేడియేషన్ భయాలతో ఎగుమతులు కూడా పడిపోవడంతో ప్రపంచంలో అమెరికా, చైనాల తర్వాత మూడవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధ అయిన జపాన్ జిడిపి కుచించుకుపోయింది. ఆర్ధిక నియమాల ప్రకారం వరుసగా రెండు క్వార్టర్ల పాటు జిడిపి తగ్గుదల నమోదు చేసినట్లయితే ఆ దేశ ఆర్ధిక వ్యవస్ధ రిసెషన్ ఎదుర్కొంటున్నట్లు…