మోడి వికాస పురుషుడు కాదు, వినాశ పురుషుడు -ఉమాభారతి
ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. ఒకరి బండారం మరొకరు బైటపెట్టుకునే పనులు జోరందుకున్నాయి. ‘తమలపాకుతో నువ్వు ఒకటంటే తలుపు చెక్కతో నేనొకటి’ అంటూ పార్టీలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. జనానికి ఏమిటి, ఎలా చేస్తామో చెప్పడం మాని ‘నువ్వు వెధవ’ అంటే ‘నువ్వు వెధవ’ అని తిట్టిపోసుకుంటున్నాయి. ‘రీ కౌంటింగ్ మంత్రి’ అని ఒకరు వెకిలి చేస్తే ‘ఎన్ కౌంటర్ ముఖ్యమంత్రి’ అని మరొకరు గుట్టు విప్పుతున్నారు. మోడిపై గతంలో ఉమాభారతి చేసిన విమర్శల వీడియోను తాజాగా వెలికి తీయడం…