ఓ సమైక్య మిత్రుడి ఆక్రోశం!

ప్రొద్దుటూరి అప్పారావు గారి వ్యాఖ్య ఇది. ‘పిట్ట కధ: తెలంగాణ – నదిలో దుప్పటి’ అన్న టపా కింద రాశారు. ఆంగ్లంలో రాసిన వ్యాఖ్యను తెనుగీకరించి ప్రచురిస్తున్నాను. మనం సమైక్యాంధ్ర కోసం పోరాడొచ్చు. కానీ మార్గం సరైనది కాదు. రాజకీయ నాయకులు (ఎం.ఎల్.ఏలు, ఎం.పిలు) అందరూ తమ జీత భత్యాలను వినియోగించుకుంటున్నారు. ఒక ఎం.పి గారు (ఉద్యమంలో) పాల్గొంటూనే తిరుమల ఛైర్మన్ గా పదవిని అనుభవిస్తున్నారు. రాజకీయ నాయకుల వ్యాపారాలన్నీ ఆటంకం లేకుండా చక్కగా నడుస్తూనే ఉన్నాయి.…