భారత ఆర్ధిక వ్యవస్ధ, మన్మోహన్ వ్యర్ధ ప్రయత్నం -కార్టూన్
భారత ఆర్ధిక వ్యవస్ధకు చేసిన జబ్బుకి మళ్ళీ ఎఫ్.డి.ఐ (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) మందు వేయడానికి మన్మోహన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. క్షీణిస్తున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలను వృద్ధి చేసుకోడానికీ, ప్రమాదకరంగా ఉన్న కరెంటు ఖాతా లోటును స్ధిరీకరించడానికి ఎఫ్.డి.ఐలు తప్ప మరో మార్గం లేదని భారత ప్రభుత్వంలోని ఆర్ధిక పండితులు ఒక నిర్ణయానికి వచ్చేశారు. ప్రజలు, ప్రతిపక్షాల అభ్యంతరాలతో నిమిత్తం లేకుండా వివిధ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని పెంచుతున్నట్లు వాణిజ్య మంత్రి ఆనంద్…