అదేదో హిల్లరీతో తేల్చుకోండి, మాయవతితో ‘వికీలీక్స్’ జులియన్

మాయావతి దూషణలకు వికీలీక్స్ ఛీఫ్ ఎడిటర్ జులియన్ అస్సాంజ్ స్పందించాడు. అమెరికా డిప్లొమేటిక్ కేబుల్స్ లో ఉన్న అంశాలతో సమస్య ఉన్నట్లయితే, మాయావతి, అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిల్లరీ క్లింటన్‌తో తేల్చుకోవాలని చెప్పాడు. అమెరికా రాయబారి తమ ప్రభుత్వానికి రాసిన కేబుల్ లో మాయవతిని ‘గర్వం ప్రదర్శించే’ వ్యక్తిగా పేర్కొన్నాడు. తనను ఎవరో హత్య చేయనున్నారన్న ఆలోచనతో తన ఆహారాన్ని రుచి చూడడానికి ఇద్దరిని నియమిందుకుందనీ, తొమ్మిది మంది వంటవాళ్ళు ఉన్నారనీ, తనకు నచ్చిన బ్రాండు…