అబద్ధపు వార్తలపై కొత్త కౌబాయ్ సవారీ -కార్టూన్
అంకుల్ శామ్ కౌబాయ్ రూపంలో సవారి చేయడానికి ఇప్పుడు గుర్రాలు అవసరం లేదు. గుర్రాల శక్తికి పరిమితి ఉంది. వాటికి తిండి పెట్టాలి. రెస్ట్ కావాలి. కౌబాయ్ కూడా శ్రమ పడాలి. కాని ఆధునిక గుర్రంపై సవారీకి అవేమీ అవసరం లేదు. అది వారానికి ఏడురోజులూ, రోజుకి ఇరవై నాలుగ్గంటలూ అలుపు సొలుపూ లేకుండా పని చేస్తుంది. కౌబాయ్ విశ్రాంతి తీసుకునే టైంలో కూడా పని చేస్తుంది. ప్రపంచంలోని ప్రతి మూలకీ ఏక కాలంలో ప్రయాణం చేస్తుంది.…