అమెరికా వ్యాపారులకు మోడి మీద అనుమానాలు!
తాను చెబుతున్నట్లుగా ఆర్ధిక సంస్కరణలు అమలు చేయడంలో భారత ప్రధాని నరేంద్ర మోడికి గల నిబద్ధతపై తమకు అనుమానాలు ఉన్నాయని అమెరికా వ్యాపార వర్గాలు తమ అధ్యక్షుడు బారక్ ఒబామాకు మొర పెట్టుకున్నారు. మోడి ప్రభుత్వం పైకి తాము వ్యాపార వర్గాలకి అనుకూల వాతావరణం ఏర్పాటు చేస్తామని చెబుతూ ఆచరణలో భిన్న చర్యలు తీసుకుంటోందని యు.ఎస్.ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో పాటు మరో 15 వ్యాపార సంఘాలు ఒబామాకు ఫిర్యాదు చేశాయి. మోడి వస్తున్నారు గనుక ఒత్తిడి…