చైనా, అమెరికాల వాణిజ్య అసమతూకం -కార్టూన్

పశ్చిమ దేశాలు, చైనా పట్ల గుర్తుగా ఉండే ముఖ్యమైన అంశాల్లో వాణిజ్య మిగులు ఒకటి. ప్రతి నెలా చైనాతో యూరప్ దేశాలకు గానీ, అమెరికాకి గానీ వాణిజ్య మిగులు ఉండవలసిందే. అమెరికాతో చైనాకు గల వాణిజ్య మిగులు గురించి చెప్పనవసరం లేదు. ప్రతి సంవత్సరం కనీసం రెండొందల బిలియన్ డాలర్లవరకూ వాణిజ్య మిగులు చైనాకు ఉంటోంది. ఇది అమెరికాకి అస్సలు నచ్చడం లేదు. చైనా ఉద్దేశ్యపూర్వకంగా తన కరెన్సీ యువాన్ విలువను తక్కువగా ఉంచడం వలన చైనా…

చైనాలో మరింత క్షీణించిన వ్యాపార వృద్ధి, రికార్డు స్ధాయిలో వాణిజ్య మిగులు

చైనాలో జూన్ నెలలో వ్యాపార కార్యకలాపాలు మరింత నెమ్మదించాయని తాజా గణాంకాలు తెలుపుతున్నాయి. మే నెలలో కంటే జున్ నెలలో కూడా దిగుమతులు పడిపోయాయి. దానితో చైనాకు వాణిజ్య మిగులులో మరింత పెరుగుదల రికార్డయ్యింది. ప్రపంచంలో రెండవ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధ కలిగిన చైనా, ఆదివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం వాణిజ్య మిగులు 22.2 బిలియన్ డాలర్లకు పెరిగింది. మే నెలలో దిగుమతుల వృద్ధి రేటు 28.4 శాతం ఉండగా, జూన్ నెలలో అది…

చైనా కరెన్సీ యువాన్ విలువపై మాట మార్చిన అమెరికా ట్రెజరీ

చైనా తన కరెన్సీ యువాన్ విలువను కృత్రిమంగా తక్కువ స్ధాయిలో ఉంచుతున్నదంటూ గత రెండు, మూడు సంవత్సరాలనుండీ వాదిస్తూ వచ్చిన అమెరిక ట్రెజరీ డిపార్టుమెంటు ఇప్పుడు “అబ్బే, అదేం లేదు” అంటోంది. యువాన్ విలువ అమెరికా, చైనాల మధ్య ఒక వివాదాంశంగా చాలాకాలం నుండి ఉంది. ముఖ్యంగా గత రెండు, మూడు సంవత్సరాల నుండి, ఇంకా చెప్పాలంటే ప్రపంచ ఆర్ధిక సంక్షోభం తలెత్తినప్పటి నుండి యువాన్ విలువను తగ్గించాలని అమెరికా, ఐరోపా దేశాలతో పాటు ఇండియా, జపాన్‌లు…

భూకంపం దెబ్బకి మళ్ళీ ఆర్ధిక మాంద్యంలోకి జారుకున్న జపాన్

ఊహించినంతా జరిగింది. సంవత్సరాలపాటు డిఫ్లేషన్‌తో తీసుకున్న జపాన్ ఆర్ధిక వ్యవస్ధ భూకంపం, సునామిల ధాటికి మరోసారి ఆర్ధిక మాంద్యం (రిసెషన్) లోకి జారిపోయింది. వినియోగదారుల డిమాండ్ ఘోరంగా పడిపోవడం, రేడియేషన్ భయాలతో ఎగుమతులు కూడా పడిపోవడంతో ప్రపంచంలో అమెరికా, చైనాల తర్వాత మూడవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధ అయిన జపాన్ జిడిపి కుచించుకుపోయింది. ఆర్ధిక నియమాల ప్రకారం వరుసగా రెండు క్వార్టర్ల పాటు జిడిపి తగ్గుదల నమోదు చేసినట్లయితే ఆ దేశ ఆర్ధిక వ్యవస్ధ రిసెషన్ ఎదుర్కొంటున్నట్లు…