అరగంటకోసారి విశ్రాంతి కోరే పని అది, పదేళ్ళుగా సెలవే లేదు

భారత దేశ రాజధాని న్యూఢిల్లీలోనే వాజీర్ పూర్ పారిశ్రామిక ప్రాంతంలో గల అనేక స్టీల్ ప్లాంట్లలో పదేళ్ళుగా సెలవన్నది తెలియకుండా పని చేస్తున్న కార్మికుల సంగతి వెలుగులోకి వచ్చింది. వారానికొక విశ్రాంతి దినం కోసం అక్కడి కార్మికులు స్వచ్ఛందగా సమ్మెకు దిగడంతోనే ఇప్పటికైనా వారి దుస్థితి వెలుగులోకి వచ్చింది. దాదాపు పదేళ్ళ తర్వాత మొదటిసారిగా వాజీర్ పూర్ స్టీల్ ప్లాంటుల కార్మికులు బుధవారం రోజు (ఫిబ్రవరి 29) వారాంతపు సెలవు దినాన్ని పొందనున్నారు. ఆ రోజు వారు…