ప్రతిపక్షాల కుంభకోణాలకేమీ తక్కువలేదు, మాకేం భయం? -ప్రధాని
అటు పాలక పక్షాలు, ఇటు ప్రతిపక్షాలూ… ఎవర్ని కదిలించినా తాము “సాధు పుంగవులమ”నే అంటారు. “కోరికలసలే లేక ప్రజాసేవలో తరించవచ్చిన సన్యాసులమే” అంటారు. మరే! రాజకీయ నాయకులు వారు చెప్పుకున్నట్లు కోరికలు లేని సన్యాసులే. అపుడు ‘సన్యాసీ సన్యాసీ రాసుకుంటే రాలేది బూడిదే’ అన్నది పాతకాలపు సామెత గా రద్దవుతుంది. ‘సన్యాసీ సన్యాసీ రాసుకుంటే రాలతాయి బోలెడు కుంభకోణాలు’ అన్నది ఆధునిక నియమంగా స్ధిరపడుతుంది. ప్రధాని మన్మోహన్ వెల్లడించిన ధైర్యంలో ఆ సంకేతాలే కనపడుతున్నాయి. సోమవారం వర్షాకాల…