ముగిసిన మండేలా లాంగ్ వాక్ -2

మొదటి భాగం తరువాత………………. అయితే మండేలా ఖైదుతో వర్ణ వివక్ష వ్యతిరేక ఉద్యమం బలహీనపడకపోగా మరింత బలపడింది. 1980ల కల్లా జాత్యహంకార రాజ్యం ఆస్తులను ధ్వంసం చేసే చర్యలు ఊపందుకున్నాయి. గెరిల్లా దాడులు పెరిగిపోయాయి. మండేలా ఖైదు దక్షిణాఫ్రికా అంతటా సంవత్సరాల తరబడి స్ధిరమైన చైతన్యానికి పాదుకొల్పింది. ఉమ్మడి నాయకత్వానికి మండేలా ప్రాధాన్యం 1986లో వెలువడిన ‘మండేలా కోసం ఎదురుచూపులు’ అన్న పుస్తకంలో రచయిత జె.ఎం.కొయెట్జి ఇలా పేర్కొన్నారు. “1985 నాటి తిరుగుబాట్లలో ఎక్కడ చూసినా ఆయన…

లాంగ్ వాక్ చాలించిన నెల్సన్ రొలిహ్లాహ్లా మండేలా -1

నెల్సన్ రొలిహ్లాహ్లా మండేలా ‘సుదీర్ఘ నడక’ (లాంగ్ వాక్) గురువారం సాయంత్రంతో (స్ధానిక సమయం) ముగిసింది. 95 సంవత్సరాల ముదిమి మీద పడిన నల్ల సూర్యుడు నల్లజాతి విముక్తిని అర్ధాంతరంగా వదిలి శాశ్వత అస్తమయాన్ని ఆవాహన చేసుకున్నాడు. గత కొన్నేళ్లుగా పదే పదే ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న మండేలా ఇక ఊపిరి పీల్చడం తనవల్ల కాదంటూ సెలవు తీసుకున్నాడు. శ్వేత జాత్యహంకార అణచివేతను ధిక్కరించిన నల్ల వజ్రం తన జీవితకాల పోరాట వెలుగులను తన జాతిజనుల చరిత్రకు…