చెప్పులు, కుర్చీలూ… అప్పుడప్పుడూ పూలు! -కార్టూన్
ఓపిక ఉండాలే గానీ ఎన్నికల చిత్రాలు ఎన్నయినా చెప్పుకోవచ్చు. ప్రత్యర్ధి రాజకీయ పార్టీలపైనా, అభ్యర్ధుల పైనా నానా కూతలూ కూసుకునే ఎన్నికల కాలంలో భరించలేని శబ్ద కాలుష్యం జనాన్ని పట్టి పీడిస్తూ ఉంటుంది. ఒక్క శబ్ద కాలుష్యం ఏం ఖర్మ, పత్రికల నిండా సాహితీ కాలుష్యం కూడా దుర్గంధం వెదజల్లుతూ ఉంటుంది. ఒకరి లోపాలు మరొకరు ఎత్తి చూపుకుంటూ గాలిని నింపే దూషణలతో పాటు అప్పుడప్పుడూ -మారుతున్న కాలాన్నీ, మారని అవసరాలను బట్టి- ప్రత్యర్ధులపై ప్రశంసల పూల…