తడిమే చేతులు, ఆకలి చూపులు, అసభ్య కూతలు… భయం, భయం…

లైంగిక అత్యాచారాలు గొప్పోళ్ల ఇళ్లకు దూరమా? అంగుళం, అంగుళమూ సంపదలు ఉట్టిపడే పాల రాతి చలువ గోడల మధ్యకు ఆకలి చూపులు చొరబడవా? ఊలు దారాలకు డబ్బు కట్టలు దట్టించి నేసిన మడత నలగని సూటు వెనుక చీకటి అంతరంగాలకు తావు లేదా? వజ్రపుటుంగరాలు, గోల్డెన్‌ రిస్టు వాచీలు ధరించే చేతులు అసభ్య చేష్టలు ఎరుగవా? ప్రపంచ ప్రఖ్యాత సితార్ మేస్ట్రో కూతురుగా పుట్టి తండ్రి సంగీత వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న అనౌష్క శంకర్ చెప్పిన చేదు నిజాలు…