తుపాకి పేల్చిన తూనీగలున్నయట… -వీడియో
‘అర్ధరాత్రి స్వతంత్రం’ అని ఒక సినిమా ఉంది. ఆర్.నారాయణ మూర్తి తీసిన మొదటి సినిమా ఇది. విశాఖకు చెందిన పాటల రచయిత వంగపండు ప్రసాద్ రాసి, స్వయంగా పాడిన పాట ఒకటి ఈ సినిమాలో చిత్రీకరించారు. అద్భుతమైన పాట అది. సామాన్యులే చరిత్ర నిర్మాతలనీ ఆ పాట పరోక్షంగా చెబుతుంది. ఆ పాట వింటుంటే రోమాలు నిక్క బొడుచుకుని ఎక్కడ లేని ఉత్సాహం పొంగుకుని వస్తుంది. కావాలంటే కింద లింక్ క్లిక్ చేసి మీరూ వినండి. ఏం పిల్లడో…
