గడ్డాఫీ అనంతర లిబియా కోసం పశ్చిమ దేశాల ‘బ్లూప్రింట్ లీకేజి’ నాటకం
“గడ్డాఫీ అనంతర లిబియా (ప్రజల) కోసం పశ్చిమ దేశాలు -ఫ్రాన్సు, బ్రిటన్, అమెరికా, ఇటలీ మొ.వి- ఒక ప్రణాళికను తయారు చేశాయి. ఈ ప్రణాళిక ప్రఖ్యాత లండన్ పత్రిక ‘ది టైమ్స్’ పత్రిక చేతికి చిక్కింది. ప్రణాళికలోని కొన్ని అంశాలను ఆ పత్రిక ప్రచురించింది. టైమ్స్ తో పాటు ‘ది ఆస్ట్రేలియన్’ పత్రిక కూడా ఆ వివరాలను ప్రచురించింది. ఈ బ్లూప్రింట్ తయారు చేయడంలో పశ్చిమ దేశాలు లిబియా తిరుగుబాటు ప్రభుత్వం ‘నేషనల్ ట్రాన్సిషన్ కౌన్సిల్’ (ఎన్.టి.సి)…