లియు బోలిన్: మాయం (అయ్యే) కళలో నిష్ణాతుడు -ఫోటోలు

కళలు 64 రకాలని తెలుగు పెద్దలు చెబుతారు గానీ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పుస్తకం తెరిస్తే కళల సంఖ్యకు అసలు పరిమితంటూ ఉండదని తెలిసొస్తుంది. మాయం అయ్యే కళ గిన్నిస్ బుక్ లోకి ఎక్కిందో లేదో తెలియదు గానీ, లియు బోలిన్ అనే చైనా కళాకారుడు ఈ కళలో ఆరితేరాడు. మనం రోజూ చూసే దృశ్యాలలో కలిసిపోయి తానక్కడ లేనట్లు భ్రమ కల్పించడం లియు ప్రదర్శించే కళ. అందుకోసం ఆయన ఎంచుకున్న మార్గం తన శరీరాన్నే…