ఎట్టకేలకు స్వాతంత్ర్యం పొందిన లిబియా? -కార్టూన్

ఫ్రాన్సు, బ్రిటన్, అమెరికా దేశాల నాయకత్వంలో నాటో వాయు సేనలు లిబియా గగన తలంపై వీరవిహారం చేస్తూ లిబియా పౌరులను బాంబింగ్‌తో రక్షిస్తూ ముందు నడవగా ఇన్నాళ్లూ అమెరికాలో శి(ర)క్షణ పొందిన లిబియా స్వతంత్ర పిపాసులు లిబియా ప్రజల స్వేచ్ఛా వాయువుల కోసం తమ జీవితాల్ని ధారపోసి గడ్డాఫీ ప్రభుత్వంపై తిరుగుబాటును పరిపూర్తి కావించారు. అమెరికా, ఇటలీ, ఫ్రాన్సు, బ్రిటన్ ఆయిల్ కంపెనీలు నూతనంగా సంపాదించిన స్వేచ్ఛతో నూనె పొలాల్లోకి దుమికి ఆయిలోత్సాహంతో ఆనంద నృత్యం చేస్తున్నాయి.…