లిబియాలో నాటో ‘యుద్ధ నేరాలకు’ పాల్పడినమాట నిజం -వీడియో
గ్లోబల్ రీసర్చ్ సంస్ధ తన వెబ్‌సైట్ లో ఈ వీడియోను ప్రచురించింది. లిబియా ప్రజలకోసం నాటో బలగాలు వైమానిక దాడులు, బాంబు దాడులు చేశాయని పశ్చిమ దేశాల వార్తా సంస్ధలు తెంపు లెకుండా అబద్ధాలు ప్రచారం చేశాయి. వారి బాంబుదాడుల్లో పౌరులు మరణించిన ఘటనలకు సమాధానం ఇవ్వకపోగా, యుద్ధంలో అనుబంధ నష్టం సహజమేనని అహంకార పూరితంగా బదులిచ్చారు. తద్వారా లిబియాపై తాము సాగిస్తున్నది యుద్ధమేనని అంగీకరించారు. కాని ఫ్రాన్సు, అమెరికా, బ్రిటన్ లు ఐక్యరాజ్యసమితి తీర్మానం మేరకు…