ఫ్రెంచి, బ్రిటిష్ కిరాయి సైనికులను పట్టుకున్న గడ్డాఫీ బలగాలు
ఫ్రాన్సు, బ్రిటన్, అమెరికాలు లిబియా తిరుగుబాటు పూర్తయ్యిందని ప్రకటించాయి. గడ్డాఫీ కబంధ హస్తాలనుండి లిబియా ప్రజలను విముక్తం చేసినట్లు ప్రకటించాయి. ఐనా నాటో వైమానిక దాడులు ఆగలేదు. లిబియా పౌరులను గడ్డాఫీబారినుండి కాపాడడానికి వైమానికదాడులు చేస్తున్నామని ఇన్నాళ్ళూ ప్రకటిస్తూ వచ్చిన ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్ ల నేతృత్వంలోని నాటో బలగాలు గడ్డాఫీ లిబియా వదిలి వెళ్ళినప్పటికీ ఎందుకు ఇంకా బాంబు దాడులు చేస్తున్నారు. గడ్డాఫీ బలగాలు ప్రస్తుతం గడ్డాఫీ సొంత నగరం సిర్టే, మరొక పట్టణం బాన్…