నాటో దాడులకు ఫలితం, గౌరవప్రదమైన వీడ్కోలు కోరుకుంటున్న గడ్డాఫీ?

లిబియాపై పశ్చిమ దేశాల దురాక్రమణ దాడులకు ఫలితం వస్తున్నట్టే కనిపిస్తోంది. లిబియాను 42 సంవత్సరాలనుంది ఏలుతున్న కల్నల్ మౌమ్మర్ గడ్డాఫీ ఎలాగూ తాను గద్దె దిగక తప్పదన్న అవగాహనతో గౌరవప్రదమైన వీడ్కోలు కోరుకుంటున్నాడని గడ్డాఫీ పాలనా బృందంలోని వారిని ఉటంకిస్తూ ‘ది గార్దియన్’ పత్రిక వార్తను ప్రచురించింది. తాను నలభై సంవత్సరాలపాటు పాలించీన లిబియాలో ఒక గాడ్ ఫాదర్ లాంటి ఇమేజ్ తో పదవినుండి నిష్క్రమించాలని కోరుకుంటున్నట్లుగా ఆయన సన్నిహితుల్లో కనీసం నలుగురిని ఉటంకిస్తూ ఆ పత్రిక…

లిబియా తిరుగుబాటు ప్రభుత్వ గుర్తింపుకు అమెరికా నిరాకరణ, కొనసాగుతున్న పౌరుల మరణాలు

లిబియా తిరుగుబాటుదారులు ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక ప్రభుత్వం “నేషనల్ ట్రాన్సిషనల్ కౌన్సిల్” (ఎన్.టి.సి) ను అధికారిక ప్రభుత్వంగా గుర్తించడానికి అమెరీక నిరాకరించింది. రెబెల్ కౌన్సిల్‌లోని సీనియర్ సభ్యుడొకరు అమెరికా గుర్తింపు పొందడానికి అధ్యక్ష భవనంలొ చర్చలకు హాజరయ్యాడు. రెబెల్ కౌన్సిల్ కోరికను అధ్యక్ష భవనం తిరస్కరించింది. మరో వైపు శుక్రవారం రాత్రి నాటో విమానాలు జరిపిన బాంబు దాడుల్లో బ్రెగా పట్టణంలో ప్రభుత్వ, తిరుగుబాటు వర్గాల మధ్య శాంతి చర్చలు జరిపే నిమిత్తం వచ్చి ఉన్న 11…

లిబియా విభజన వైపుగా యూరోపియన్ యూనియన్ చర్యలు?

లిబియాలో అంతర్యుద్ధాన్ని అడ్డు పెట్టుకుని ఆ దేశాన్ని రెండుగా విభజించేవైపుగా యూరోపియన్ యూనియన్ చర్యలు ప్రారంభించినట్టు కనిపిస్తోంది. తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న లిబియా తూర్పు ప్రాంతానికి కేంద్రంగా ఉన్న బెంఘాజీ పట్టణంలో తన కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నది. బెంఘాజీ లిబియాలో రెండవ అతి పెద్ద పట్టణం. తిరుగుబాటుదారులుగా చెప్పబడుతున్న వారు ఇక్కడినుండే తమ చర్యలను ప్రారంభించారు. ఒకప్పుడు గడ్డాఫీ సైన్యంలో అధికారులుగా ఉన్న వారిని అమెరికా ఆకర్షించి గడ్డాఫీపై కొద్ది సంవత్సరాల క్రితం తిరుగుబాటు చేయించింది. అది విఫలమయ్యింది.…

గడ్డాఫీని మరోసారి టార్గెట్ చేసిన నాటో దాడులు, కొనసాగుతున్న ప్రతిష్టంభన

లిబియా ప్రజలను రక్షించే పేరుతో విచక్షణారహితంగా లిబియాపై వైమానికి దాడులు చేస్తున్న నాటో దళాలు మంగళవారం మరోసారి గడ్డాఫీ నివాస కాంపౌండ్‌పై పలు క్షిపణులతో దాడి చేశాయి. ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ రాయిటర్స్ ఈ వార్తను ప్రచురించింది. ఏప్రిల్ 30 తేదీన నాటో బాంబు దాడుల్లో గడ్డాఫీ చివరి కొడుకుతో పాటు ముగ్గురు మనవళ్ళు చనిపోయాక గడ్డాఫీ బహిరంగంగా ఇంతవరకు కనపడలేదు. క్షిపణి దాడుల వలన అద్దాలు పగిలి చెల్లాచెదురు కావడంతో అవి తగిలి నలుగురు పిల్లలు…

గడ్డాఫీ యుద్ద ఎత్తుగడలతో నాటో దళాల బేజారు

లిబియాలో పశ్చిమ ప్రాంతంలో తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ఏకైక పట్టణం మిస్రాటాలో నాటో విమానాలు గడ్డాఫీ బలగాలపై దాడులు కొనసాగుతున్నాయి. అయితే గడ్డాఫీ బలగాలు అనుసరిస్తున్న గెరిల్లా ఎత్తుగడల వలన నాటో వైమానిక దాడులు పెద్దగా ఫలితాలను సాధించలేక పోతున్నాయి. కాల్పులు జరిపి చెట్ల కిందో, భవనాల మధ్యనో దాక్కుంటూ గడ్దాఫీ బలగాల ట్యాంకులు తదితర యుద్ద ఆయుధాలు పని చేస్తుండడంతో వాటిపై బాంబు దాడులు చేసి నాశనం చేయడం నాటో దళాలకు కష్ట సాధ్యంగా మారింది.…

గడ్డాఫీని చంపడం చట్టబద్ధమేనట! అందుకు లిబియన్లు కోపగించుకుంటే చట్ట విరుద్ధమట!!

గడ్డాఫీ నివాస భవనాలపై శక్తివంతమైన మిసైళ్ళతో దాడులు చేయడం వలన గడ్డాఫీ కొడుకుతో పాటు ముగ్గురు మనవళ్ళు చనిపోవడంతో లిబియా రాజధాని ట్రిపోలి ప్రజలు అగ్రహోదగ్రులయ్యారు. నాటో హంతక దాడులను వ్యతిరేకిస్తూ పశ్చిమ దేశాల రాయబార కార్యాలయాల ముందు ట్రిపోలి ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పశ్చిమ దేశాల హంతకదాడులకు కొమ్ము కాస్తున్న ఐక్యరాజ్య సమితి కార్యాలయాల మీద కూడా దాడులు చేయడంతో సమితి తన కార్యాలయాల్ని మూసుకుని తమ సిబ్బందిని వెనక్కి పిలిపించుకుంది. బ్రిటన్ లోని…

గడ్దాఫీని చంపడానికి మళ్ళీ నాటో దాడి, కొడుకు ముగ్గురు మనవళ్ళు మృతి

గడ్డాఫీని చంపడానికే కంకణం కట్టుకున్న నాటో దేశాలు మరోసారి లిబియా అధ్యక్షుడు గడ్డాఫీ నివాస సముదాయంపై మిసైళ్ళతో దాడి చేశాయి. దాడినుండి గడ్డాఫీ తప్పించుకున్నప్పటికీ చిన్న కొడుకు సైఫ్ ఆల్-అరబ్ తో పాటు ముగ్గురు మనవళ్ళు చనిపోయినట్టు లిబియా ప్రభుత్వం తెలిపింది. భవనంపై కనీసం మూడు మిసైళ్ళు ప్రయోగించారనీ, దాడిలో భవనం పూర్తిగా దెబ్బతిన్నదనీ లిబియా ప్రభుత్వ ప్రతినిధి మౌసా ఇబ్రహీం తెలిపాడు. దాడి జరిగిన కొద్ది గంటల్లోనే నాటో ప్రతినిధి ఛార్లెస్ బౌచర్డ్ వివరణ ఇవ్వడానికి…

గడ్డాఫీని టార్గెట్ చేయాలంటున్న బ్రిటన్, చట్టవిరుద్ధమని లాయర్ల హెచ్చరిక

“లిబియా ప్రభుత్వ కమాండ్ అండ్ కంట్రోల్ (గడ్డాఫీ) ను టార్గెట్ చెయ్యడం చట్టబద్ధమే” అని బ్రిటన్ డిఫెన్స్ సెక్రటరీ లియామ్ ఫాక్స్ ప్రకటించాడు. అయితే “గడ్డాఫిపైన గానీ, లిబియా ప్రభుత్వ సైన్యంపైన గానీ దాడుల చేయడానికీ, లిబియా తిరుగుబాటుదారులకు ట్రైనింగ్ ఇవ్వడానికీ ఐక్యరాజ్య సమితి తీర్మానం అనుమతి ఇవ్వలేదు. అలా చేస్తే చట్ట విరుద్ధం” అని బ్రిటన్ ప్రభుత్వ లాయర్లు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్ ప్రధాని కామెరూన్ కూడా లిబియా తిరుగుబాటుదారులకు ఆయుధాలిచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని తమ ఎం.పిలకు…

గడ్డాఫీని చంపడానికి పశ్చిమ దేశాల బాంబు దాడులు

లిబియా పౌరుల్ని రక్షించే పేరుతో లిబియా ప్రభుత్వ సైనిక సంపత్తిని నాశనం చేసే పనిలో ఉన్న పశ్చిమ దేశాలు మళ్ళీ గడ్డాఫీని చంపే ప్రయత్నాలను తీవ్రం చేశాయి. గడ్డాఫీ నివాస భవనాలపై సోమవారం నాటో సేనలు శక్తివంతమైన బాంబులను ప్రయోగించాయి. లిబియాలో అంతర్యుద్ధానికి “కాల్పుల విరమణ ఒప్పందాన్ని” ప్రతిపాదిస్తూ వచ్చిన “ఆఫ్రికన్ యూనియన్” ప్రతినిధులతో చర్చించడానికి వినియోగించిన భవనం సోమవారం నాటి బాంబుదాడుల్లో బాగా ధ్వంసం ఐనట్లు వార్తా సంస్ధలు తెలిపాయి. రీగన్ అమెరికా అధ్యక్షుడుగా ఉన్న…

లిబియాలో స్పెయిన్ విలేఖరి అరెస్ట్, అరెస్టైనవారంతా క్షేమం

ఏప్రిల్ 5 తేదీన కనపడకుండా పోయిన స్పెయిన్‌కి చెందిన ఫోటో జర్నలిస్టు ఆదివారం స్పెయిన్‌లో తన తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తన క్షేమ సమాచారాన్ని తెలియజేశాడు. బ్రెగా పట్టణం శివార్లలో ఉన్న మను బ్రాబో ఇతర విలేఖరులతో పాటు అరెస్టు అయ్యాడు. సరైన అనుమతి లేకుండా లిబియాలోకి ప్రవేశించడంతో వారిని లిబియా ప్రభుత్వం అరెస్టు చేసింది. మను తండ్రి మాన్యువల్ వరెలా, తన కొడుకు బ్రాబోను మిలట్రీ జైలులో ఉంచారనీ, జైలులో తనను బాగా చూసుకుంటున్నట్లు చెప్పాడని…

మిస్రాటాను కాపాడండి, లేదా మేమే కాపాడుకుంటాం! లిబియా ఆర్మీకి గిరిజన తెగల అల్టిమేటం

లిబియాలో తిరుగుబాటుదారులకూ, ప్రభుత్వ సైనికులకూ జరుగుతున్న తీవ్రమైన పోరు కొత్త మలుపు తిరిగింది. “మిస్రాటా పట్టణం నుండి తిరుగుబాటుదారుల్ని ప్రభుత్వ సైన్యం వెళ్ళగొట్టలేకపోతే చెప్పండి. మేమే అందుకు పూనుకుంటాం” అని స్ధానిక గిరిజన తెగలు అల్టిమేటం ఇచ్చాయని ఉప విదేశాంగ మంత్రి ఖలేద్ కైమ్ ను ఉటంకిస్తూ బిబిసి తెలిపింది. “ఇకనుండి మిస్రాటాలో పరిస్ధితిని అక్కడ నివాసం ఉంటున్నవారు, చుట్టుపక్కల గిరిజన తెగల ప్రజలు ఎదుర్కొంటారు. ప్రభుత్వ సైన్యం ఆ భాధ్యతనుండి విరమించుకుంటుంది. వారు తిరుగుబాటుదారులతో చర్చలు…

మిస్రాటా శరణార్ధి నౌకలు, పశ్చిమ దేశాల అబద్ధపు ప్రచారానికి సాక్ష్యం

లిబియా యుద్ధం ఎందుకు వచ్చిందంటే చాలామంది చెప్పే సమాధానం “గడ్డాఫీ సైన్యాలు లిబియా పౌరులపై దాడులు చేస్తూ చంపడం వలన” అని. అరబ్ దేశాల్లో ప్రజాస్వామిక హక్కుల కోసం ఉద్యమాలు చెలరేగుతున్నాయనీ, దానిలో భాగంగానే లిబియాలొ కూడా ప్రజాస్వామిక ఉద్యమం మొదలైందనీ, కానీ ఉద్యమాన్ని లిబియా నియంత గడ్డాఫీ సైనిక బలంతో అణచివేయడానికి లిబియా పౌరులను చంపుతుండడం వలన అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ ల నాయకత్వంలో కొన్ని దేశాలు లిబియా పై “నిషిద్ధ గగనతలం” అమలు చేయడానికి…

లిబియాపై యుద్ధానికి హంతక డ్రోన్ విమానాలను పంపిన అమెరికా

వందలకొద్దీ పాకిస్తాన్ పౌరులను చంపిన డ్రోన్ విమానాలను లిబియా పౌరులను రక్షించడానికి(!) పంపేందుకు ఒబామా ఆమోదముద్ర వేశాడు. ఇప్పటికే ఒక సారి దాడికి వెళ్ళిన డ్రోన్ విమానం వాతావరణం అనుకూలించక వెనుదిరిగినట్లు అమెరికా సైనిక దళాలా జాయింట్ ఛీఫ్ తెలిపాడు. తక్కువ ఎత్తులో ప్రయాణించే మానవరహిత డ్రోన్ విమానాలను అమెరికా, ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్తాన్ సరిహద్దుల్లో పాకిస్తాన్ భూభాగంలో ఉన్న తాలిబాన్ నాయకులను, మిలిటెంట్లను చంపడానికి విస్తృతంగా వినియోగిస్తోంది. వాటిబారిన పడి పాకిస్ధాన్ పౌరులు అనేకమంది చనిపోయారు. డ్రోన్…

లిబియా తిరుగుబాటుదారులకు పశ్చిమ దేశాల మిలట్రీ ట్రైనింగ్

ఐక్యరాజ్య సమితి 1973 వ తీర్మానం ప్రకారం గడ్దాఫీ బలగాల దాడుల్లో చనిపోతున్న లిబియా పౌరులను రక్షించడానికి సమితి సభ్య దేశాలు “అవసరమైన అన్ని చర్యలూ” తీసుకోవచ్చు. దీన్ని అడ్డం పెట్టుకుని తమ సైన్యాలను బహిరంగంగా లిబియాలో దింపడానికి అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్, కెనడా తదితర దేశాలకు ధైర్యం చాలడం లేదు. వారు భయపడుతున్నది గడ్దాఫీని గానీ, వారి సైనికులను చూసిగానీ కాదు. తమ సొంత ప్రజలకు అవి భయపడుతున్నాయి. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాల్లో అనేకమంది సైనికులు…

ఇరాక్ తరహాలో లిబియా దురాక్రమణకు ఏర్పాట్లు చేసుకుంటున్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు

అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు ల త్రయం తమ ఉద్దేశాలను మెల్ల మెల్లగా బైట పెట్టుకుంటున్నాయి. లిబియా తిరుగుబాటుదారులకు మిలట్రి సలదారులను పంపించడానికి బ్రిటన్ నిర్ణయించింది. గడ్డాఫీకి ఆయుధాలు అందకుండా చేయడానికి మొదట ‘అయుధ సరఫరా’ పై నిషేధం విధించారు. ఆర్ధిక వనరులు అందకుండా లిబియా ప్రభుత్వానికి అంతర్జాతీయ బ్యాంకుల్లో ఉన్న ఖాతాలను స్తంభింప జేశారు. గడ్డాఫీ విమానదాడులనుండి లిబియా ప్రజలను రక్షించచే పేరుతో “నో-ఫ్లై జోన్” అన్నారు. ఆ పేరుతో లిబియా తీర ప్రాంతాన్ని విమానవాహక నౌకలతో…