కొత్త లిబియాను సృష్టించే తొందరలో నాటో సైన్యం -కార్టూన్
నాటో బలగాల నిర్విరామ వైమానిక దాడులు ముందుండి దారి చూపగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు తయారు చేసుకున్న కీలు బొమ్మల నాయకత్వంలోని లిబియా తిరుగుబాటు బలగాలు, సగర్వంగా ట్రిపోలిని వశం చేసుకున్నాయి. ట్రిపోలిలో అడుగు పెట్టడంతోనే ప్రతీకార చర్యలకు దిగాయి. గడ్డాఫీ మద్దతుదారులుగా భావిస్తున్న వారందరినీ ఊచకోత కోసే పని మొదలైంది. ఫ్రాన్సు, బ్రిటన్, అమెరికాల ఉమ్మడి ప్రాయోజిత తిరుగుబాటు ఆద్యంతం నాటో సేనలు లిబియాపై మిసైళ్ల వర్షం కురిపించాయి. చివరి వారాల్లోనైతే తెంపు లేకుండా లిబియా…