లిబియా పోలీసు కాల్పుల్లో వందల మంది మృతి, చెదరని గడ్డాఫీ ఆధిపత్యం

లిబియాలో సైనికులు ఆందోళన చేస్తున్న ప్రజలపై నేరుగా కాల్పులు జరపడంతో అనేక మంది మరణించడమో, గాయపడటమో జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఎంతమంది మరణించినదీ ఖచ్చితమయిన సంఖ్య తెలియటం లేదు. ఇంటర్నెట్ సౌకర్యాన్ని దాదాపుగా అడ్డుకోవటం, మీడియా పై అనేక ఆంక్షలు అమలులో ఉండటంతో ఆందోళనలు, కాల్పులకు సంబంధించిన వివరాలను ధృవపరిచేవారు లేరు. రెండు వందల మందికి పైగా చనిపోయారని ఆసుపత్రి డాక్టర్లను ఉటంకిస్తూ బిబిసి తెలియజేయగా, అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్ధను ఉటంకిస్తూ రాయిటర్స్…

లిబియాలో “ఆగ్రహ దినం”, పోలీసు కాల్ఫుల్లో 24 మంది మరణం

లిబియాలో గురువారం, ఫిబ్రవరి 17 న ప్రజలు “ఆగ్రహ దినం” (డే ఆఫ్ రేజ్) పాటించినట్లుగా వార్తా సంస్ధలు తెలిపాయి. అయితే ఆ వార్తలను అవి ధృవీకరించలేక పోతున్నాయి. పత్రికా విలేఖరులకు ఎటువంటి సమాచారం ప్రభుత్వ వర్గాలు అందించక పోవటం వలన పౌరులు చెప్పిన విషయాలను ప్రచురించాయి. రాజధాని ట్రిపోలి తప్ప ఇతర పట్టణాల్లోని కనీసం ఐదింటిలో ప్రజలు వీధుల్లోకి వచ్చినట్ల గా బిబిసి, రాయటర్స్, ఎ.ఎఫ్.పి వార్తా సంస్ధలు పౌరులను ఉటంకిస్తూ తెలిపాయి. అమెరికా సంస్ధకు…