లిక్విడిటీ ఆంటే? -ఈనాడు

బిజినెస్ వార్తల్లో మనం తరచుగా వినే/చదివే మాట ‘లిక్విడిటీ.’ వివిధ ఆస్తులకు ఎంత లిక్విడిటీ ఉందన్న విషయంపై ఆధారపడి వాటికి కొనుగోలుదారులు లభిస్తారు. లిక్విడ్ అంటే ద్రవం. ద్రవం ఒక చోట నిలబడేది కాదు. దాన్ని ఏ పాత్రలో ఉంచితే ఆ పాత్ర రూపంలో నిలబడి ఉంటుంది. నియంత్రించే పాత్ర ఏమీ లేకపోతే అది తేలికగా ఎటువంటి మానవ ప్రయత్నం లేకుండానే ప్రవహిస్తుంది. ఈ కారణం చేతనే ఒక ఆస్తిని డబ్బుగా మార్చగల సామర్ధ్యాన్ని లిక్విడిటీ అన్నారు.…