అమెరికా అబద్ధాలకు నిలువెత్తు సాక్ష్యాలు: జెస్సికా లించ్, పేట్ టిల్‌మేన్, లిండా నార్గ్రోవ్
ఒసామా బిన్ లాడెన్ హత్య విషయంలో పొంతనలేని కధనాలు చెబుతున్న అమెరికాకి అబద్ధాలు చెప్పడం కొత్త కాదు. ఇరాక్‌పై దాడి చేయడానికి కారణంగా ఆ దేశంలో సామూహిక విధ్వంసక మారణాయుధాలు ఉన్నాయనీ, వాటి వలన అమెరికా భద్రతకు ముప్పు అనీ అబద్ధాలు చెప్పింది. దానితో పాటు ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌కీ, ఒసామా బిన్ లాడెన్‌కీ సంబంధాలున్నాయని పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేసింది. కానీ లాడెన్‌ను చంపానని చెప్పిన తర్వాత అమెరికా అధ్యక్షుడు గానీ, అధికారులు గానీ…