వాల్-మార్ట్ కంపెనీ విస్తరణకి వ్యతిరేకంగా అమెరికన్ల నిరసన

అమెరికాలోని లాస్ ఏంజిలిస్ నగరంలో రిటైల్ దుకాణాల కంపెనీ వాల్-మార్ట్ కొత్త షాపులు నెలకొల్పడానికి వ్యతిరేకంగా నగర వాసులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అనేకవేలమంది ప్రజలు వాల్-మార్ట్ కంపెనీకి వ్యతిరేకంగా ప్రదర్శనలో పాల్గొన్నారని ‘లాస్ ఏంజిలిస్ టైమ్స్’ పత్రిక తెలిపింది. శనివారం జరిగిన ప్రదర్శనల్లో ప్రజలు ‘వాల్-మార్ట్ = దరిద్రం’ అని బ్యానర్లు ప్రదర్శించారని తెలిపింది. తక్కువ వేతనాలు చెల్లిస్తూ, కార్మికులకు యూనియన్ హక్కులు వ్యతిరేకించే కంపెనీ మాకొద్దని తిరస్కరించారని తెలిపింది. “(వాల్-మార్ట్ వల్ల)…

ఆఫ్ఘన్ల శరీర భాగాలతో ఫోటోలు దిగిన అమెరికా సైనికులు

ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధంలో అమెరికా సైనికుల నీచ ప్రవర్తనకి హద్దు లేకుండా పోతోంది. దురాక్రమణకి వ్యతిరేకంగా పోరాడుతున్న ఆత్మాహుతి బాంబర్ల విడి శరీర భాగాలతో అమెరికా సైనికులు దిగిన ఫోటోలను ‘లాస్ ఏంజిలిస్ టైమ్స్’ పత్రిక ప్రచురించింది. ఆఫ్ఘన్ యుద్ధంలో విధులు నిర్వర్తించిన సైనికుడే తమకు ఆ ఫోటోలు అందించచాడని ఆ పత్రిక తెలిపింది. ఫోటోలు ప్రచురించవద్దని అమెరికా మిలట్రీ కోరినప్పటికీ ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా సైనికుల ప్రవర్తన ఎలా ఉన్నదీ అమెరికా ప్రజలకు తెలియాలన్న ఉద్దేశ్యంతో…