ఆఫ్రికా ఆదిమ జాతుల క్రికెట్ సొగసు చూడవలసిందే -ఫొటోలు
కొత్త రాతి యుగం నుండి ఉనికిలో ఉన్న ‘మాసాయ్’ ఆదిమ జాతి కీన్యా, టాంజానియాలలో నివసిస్తోంది. వీరి జనాభా కేవలం నాలుగు లక్షలే. సంచార జాతి అయిన మాసాయ్ అనేక ప్రాచీన ఆచారాలకు నెలవు. వీరిని సంచార జీవనం నుండి బైటికి రప్పించడానికి ప్రయత్నాలు చేసినా అవేవీ సఫలం కాలేదని చెబుతున్నారు. అయితే పర్యావరణ మార్పుల రీత్యా సంచార జీవనమే వీరికి శ్రీరామ రక్ష అని ప్రముఖ లండన్ వ్యవసాయ సంస్ధ ‘ఆక్స్ ఫాం’ నిర్ధారించింది. అటు…
