లాడెన్ ఇంటిలో రక్తపు మడుగులో ముగ్గురు నిరాయుధుల శవాలు, ఫోటోలు సంపాదించిన రాయిటర్స్

ఒసామా బిన్ లాడెన్‌ స్ధావరంగా చెప్పబడుతున్న ఇంటిలో రక్తపు మడుగులో పడి ఉన్న ముగ్గురు యువకుల శవాల ఫోటోలను రాయిటర్స్ వార్తా సంస్ధ సంపాదించింది. వీరి వద్ద ఎటువంటి ఆయుధాలు లేవని రాయిటర్స్ సంస్ధ తెలిపింది. అమెరికా కమేండోలు దాడి చేసి వెళ్ళిన గంట తర్వాత ఈ ఫోటోలు తీశారని ఆ సంస్ధ తెలిపింది. పాకిస్ధాన్ భద్రతా అధికారి ఒకరు ఒసామా స్ధావరంగా చెబుతున్న ఇంటిలోకి అమెరికన్ కమెండోలు వెళ్ళిన గంట తర్వాత వెళ్ళి తీసిన ఫోటోలను…