స్నోడెన్: ఈక్వడార్ కు అమెరికా బెదిరింపులు
ఇంటర్నెట్ కంపెనీల ద్వారా ప్రపంచ ప్రజలపై అమెరికా సాగిస్తున్న గూఢచర్యాన్ని, ఏకాంత హక్కుల ఉల్లంఘనను వెల్లడి చేసిన మాజీ సి.ఐ.ఏ టెక్నీషియన్ ఎడ్వర్డ్ స్నోడెన్ కేంద్రంగా అమెరికా బెదిరింపులు కొనసాగుతున్నాయి. మాస్కో విమానాశ్రయంలో చిక్కుకుపోయిన స్నోడెన్ ను వెంటనే తమకు అప్పగించాలనీ, లేకపోతే రష్యా-అమెరికా సంబంధాలు దెబ్బ తింటాయని హెచ్చరించిన అమెరికా, స్నోడెన్ కు రాజకీయ ఆశ్రయం ఇవ్వజూపుతున్న ఈక్వడార్ ను తీవ్రంగా బెదిరిస్తోంది. అమెరికా ప్రభుత్వం లోని వివిధ నాయకులు, అధికారులు ఈక్వడార్ పై వాణిజ్య…
