బ్రిటన్ యువతలో పెరుగుతున్న నిరుద్యోగం, అల్లర్లకు అదే కారణం
బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం అక్కడ నిరుద్యోగం భూతం జడలు విప్పింది. ప్రభుత్వరంగం ఉద్యోగులను తొలగిస్తుండంతో పాటు ప్రవేటు రంగ ఉత్పత్తి స్తంభించిపోవడంతో నిరుద్యోగం పెరుగుతున్నదని భావిస్తున్నారు. లండన్ తో పాటు ఇతర నగరల్లోని పేద కుటుంబాల యువకులు కొద్ది రోజుల క్రితం పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడిన నేపధ్యంలో వెలువడిన ఈ వివరాలు అల్లర్లకు కారణమేమిటో చెప్పకనే చెపుతున్నాయి. రాజకీయ నాయకులు, కార్పొరేట్ మీడియా కూడబలుక్కుని అల్లర్లకు, నిరుద్యోగం కారణం కాదంటూ నమ్మబలుకుతున్నప్పటికీ వాస్తవాలు…