రోహిత్ వేముల దళితుడు కాదా?

యూనివర్సిటీ ఆఫ్ హైదారాబాద్ లో సస్పెన్షన్ కు గురై ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ వేముల కులం గురించి ఈ నాలుగు రోజుల్లోనే అనేక కాకమ్మ కధలు ప్రచారంలో పెట్టారు. అనేక ఆడియోలు, వీడియోలు (డాక్టర్డ్) ప్రదర్శించారు. ఈ పుకార్లు, కధలు, వీడియోలు ప్రచారం చేసిపెట్టడంలో ఆధిపత్య వర్గాల చేతుల్లో ఉన్న వార్తా ఛానెళ్లు, ముఖ్యంగా ఆంగ్ల వార్తా ఛానెళ్లు తలమునకలుగా సహకరించాయి. రోహిత్ ఆత్మహత్య దేశవ్యాపితంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన దళితుడు కావడం వల్లనే…

రోహిత్ ఆత్మహత్య: సస్పెన్షన్ ఎత్తివేత

కేంద్ర ప్రభుత్వ విశ్వ విద్యాలయం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రోహిత్ మిత్రులు నలుగురు రీసర్చ్ స్కాలర్ విద్యార్ధులపై స్పస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. సస్పెన్షన్ ఎత్తివేత తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపింది. సస్పెన్షన్ ఎత్తివేసినందున విద్యార్ధులంతా సాధారణ విద్యా కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని వైస్ ఛాన్సలర్ పి అప్పారావు కోరారు. యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నియమించిన సబ్ కమిటీ గురువారం సమావేశమై సస్పెన్షన్ ను బేషరతుగా ఎత్తివేయడానికి నిర్ణయించిందని పాలకవర్గం ఒక ప్రకటనలో పేర్కొంది. “యూనివర్సిటీలో నెలకొన్న అసాధారణ…

రోహిత్: దళిత విద్యార్ధులు Vs హిందూత్వ రాజ్యం!

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఎట్టకేలకు నోరు విప్పారు. ఆమె ఇచ్చిన వివరణ విద్యార్ధుల భావోద్వేగాలను చల్లార్చడానికి బదులు మరింత రెచ్చగొట్టినట్లుగానే వెలువడింది. “ఇది దళితులు-దళితేతరుల మధ్య సమస్యకు సంబంధించినది కాదు. రెండు విద్యార్ధి సంఘాలకు మధ్య ఘర్షణకు సంబంధించిన సమస్య. దళిత్ పేరుతో భావోద్వేగాలు రెచ్చగొట్టొద్దు” అని ఆమె ప్రకటించారు. అదే నోటితో ఆమె “వైస్ ఛాన్సలర్ ఆదేశాలను (ఆర్డర్ ను) విద్యార్ధులకు స్వయంగా అందించిన వ్యక్తికూడా దళితుడే” అంటూ తాను కూడా దళితుడి భుజం…

తప్పు లేదని నిర్ధారించినా సస్పెన్షన్ ఎందుకు?

ఏ‌ఎస్‌ఏ విద్యార్ధులు ఏ తప్పూ చేయలేదనీ, వారు తప్పు చేశారని చెప్పేందుకు ఎలాంటి సాక్షాలూ లేవని యూనివర్సిటీ నియమించిన కమిటీ నిర్ధారించింది. అయినప్పటికీ ఆ అయిదుగురినీ యూనివర్సిటీ కౌన్సిల్ ఎందుకు సస్పెండ్ చేసింది? యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా పి అప్పారావు నియమితులు కావడానికి ముందు నియమించబడిన కమిటీ దళిత విద్యార్ధులది ఎలాంటి తప్పూ లేదని తేల్చింది. దానితో వారిపై ఎలాంటి చర్యకూ ఆస్కారం లేదు. కనుక సస్పెన్షన్ నన్ను రద్దు చేశారు. కానీ ఆ తర్వాతే…

దళిత నిరాకరణ నేరంలో సచివులు, నేతలు!

ది హిందు సంపాదకీయం చివరలో పేర్కొన్న ‘నిరాకరణ నేరం’ అప్పుడే జరిగిపోయింది కూడా. విద్యార్ధుల ఆత్మహత్యకు తన లేఖలకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పత్రికలు, ఛానెళ్ల సాక్షిగా నిరాకరణ జారీ చేసేశారు.  ఒక్క బండారు మాత్రమే కాదు, బి‌జే‌పి జనరల్ సెక్రటరీ పి మురళీధర్ రావు ట్విట్టర్ లో రాహుల్ గాంధీ యూనివర్సిటీ సందర్శనను ఖండిస్తూ పనిలో పనిగా “రోహిత్ దళితుడు కావడానికీ, అతనిని సస్పెండ్ చేయడానికి ఎలాంటి సంబంధమూ లేదు”…

దళిత స్కాలర్ మరణం -ది హిందు

[Death of a Dalit scholar శీర్షికన జనవరి 19 తేదీన ది హిందు ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం. -విశేఖర్] ********* యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో రీసర్చ్ స్కాలర్ గా పని చేస్తున్న దళిత విద్యార్ధి రోహిత్ వేముల ఆత్మహత్య, ప్రతిభా సంపన్నులతో నిండినవన్న భ్రాంతిని కలుగజేయడంలో పేరెన్నిక గన్న భారతీయ ఉన్నత విద్యా సంస్ధలు భూస్వామ్య దురహంకార గుణాల చేత వేధింపులకు గురవుతున్నాయనడానికి మరో విషాదకర సాక్షం.  (యూనివర్సిటీ) పాలకులు సస్పెండ్ చేసిన…

UoH విద్యార్ధి రోహిత్ ఆత్మహత్య లేఖ!

ఒక నక్షత్రం రాలిపడలేదు; నేరుగా దివికే ఏగి వెళ్లింది. చుక్కల చెంతకు వెళ్తున్నానని చెప్పి మరీ వెళ్లింది. ఆత్మలపై, దైవాలపై, దెయ్యాలపై నమ్మకంతో కాదు సుమా! తనను తాను ‘అచ్చంగా ఒక THING ని’ మాత్రమే అని తెలుసుకుని మరీ వెళ్లిపోయింది. ఈ విశ్వం అంతా నక్షత్ర ధూళితో నిర్మితమై ఉన్నదన్న సర్వజ్ఞాన్య ఎరికతో ఆ పదార్ధం జీవాన్ని చాలించుకుని నక్షత్ర ధూళితో తిరిగి కలిసేందుకు సెలవంటూ వెళ్లింది. ఆత్మహత్య పాపం కాకపోవచ్చు గానీ పరికితనం. నిజంగా…