రైలు ఛార్జీల పెంపుదల మమత కి ముందే తెలుసు -ఎన్.డి.టి.వి

తమ పార్టీకి చెందిన రైల్వే మంత్రి దినేష్ త్రివేది తనకు చెప్పకుండా రైలు ప్రయాణ ఛార్జీలు పెంచాడని ఆరోపిస్తూ, అతని సేత రాజీనామా కూడా చేయించిన మమతకి చార్జీల పెంపుదల సంగతి ముందే తలుసని ఎన్.డి.టి.వి వెల్లడించింది. రైల్వే బడ్జెట్ ప్రతిపాదిస్తున్న సమయంలోనే మమతతో రైల్వే ఛార్జీల పెంపు విషయాన్ని ప్రభుత్వ పెద్దలు చర్చించారని అభిజ్ఞ వర్గాలను ఉటంకిస్తూ ఎన్.డి.టి.వి తెలిపింది. ఒక్క మమతనే కాకుండా ప్రధాన ప్రతిపక్ష పార్టీలను కూడా ప్రభుత్వం సంప్రదించిందనీ, రైలు ఛార్జీలు…