రైల్వే బడ్జెట్: ఎఫ్.డి.ఐతో సేవల మెరుగు(ట)
నరేంద్ర మోడి/ఎన్.డి.ఏ 2 ప్రభుత్వం మొట్టమొదటి బడ్జెట్, ఇంతదాకా రైల్వేరంగంలో లేని ఎఫ్.డి.ఐలకు స్వాగతం పలకడంతో మొదలయింది. బహుళ బ్రాండు రిటైల్ రంగంలో ఎఫ్.డి.ఐల వల్ల భారతీయుల ఉపాధి పోతుందని వాదించిన బి.జె.పి అదే ఎఫ్.డి.ఐలకు రైల్వేల్లో రెడ్ కార్పెట్ పరవడానికి సిద్ధం అయింది. కేవలం రైల్వేల అభివృద్ధి కోసమే మౌలిక నిర్మాణాలలో (ఇన్ఫ్రా స్ట్రక్చర్) ఎఫ్.డి.ఐలను ఆహ్వానిస్తాం తప్ప రైల్వేల నిర్వహణలో కాదని హామీ ఇచ్చింది. ఎక్కడికి పిలిచినా ఎఫ్.డి.ఐ, ఎఫ్.డి.ఐ యే. అదేమీ భారత…