రేమండ్ డేవిస్ ని గుర్తు చేసుకో అమెరికా! -పాక్ మాజీ రాయబారి

అమెరికాలోని పాకిస్తాన్ ఎంబసీలో మాజీ అత్యున్నత రాయబారిగా పని చేసిన హుస్సేన్ హక్కాని అమెరికా పౌరుడు, సి.ఐ.ఏ గూఢచారి రేమండ్ డేవిస్ ఇద్దరు పాక్ పౌరులను కాల్చి చంపిన కేసు విషయంలో పాక్ ప్రభుత్వ అసంతృప్తికి గురై ఉద్వాసన పొందడం విశేషం. “అనేక దేశాలలో అమెరికా రాయబారులకు అక్కడి చట్టాలకు అతీతమైన సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి… విదేశాల్లోని ప్రతి అమెరికా రాయబార భవనం చుట్టూ రక్షణ నిర్మాణాలు (barriers) అమర్చి ఉంటాయి. సాధారణంగా ఈ నిర్మాణాలు ప్రజల…

పాక్ లో ఆయుధాలు రవాణా చేస్తూ పట్టుబడిన అమెరికా రాయబారులు

పాకిస్తాన్ పట్టణం పెషావర్ లో ఆయుధాలు అక్రమంగా రవాణా చేస్తూ ముగ్గురు అమెరికా రాయబారులు సోమవారం పట్టుబడినట్లు పాక్ పత్రిక డాన్ తెలిపింది. పెషావర్ మోటార్ వే టోల్ ప్లాజా వద్ద రొటీన్ చెకింగ్ లో వీరు పట్టుబడ్డారు. ముగ్గురు అమెరికన్లను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల తనిఖీలో నాలుగు అస్సాల్ట్ రైఫిళ్ళు + 36 మ్యాగజైన్లు, మరో నాలుగు పిస్టళ్లు + 30 మ్యాగజైన్లు దొరికాయని పోలీసులను ఉటంకిస్తూ డాన్ తెలిపింది. టోల్ ప్లాజా వద్ద…

రేమాండ్ ఖైదు, ఒసామా హత్యలతోనే అమెరికా-పాకిస్ధాన్‌ల సావాసం చెడింది -ఒబామా

పాకిస్ధాన్‌కు చెప్పకుండా పాక్ లోకి చొరబడి ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా కమెండోలు హత్య చేయడం వల్లనే పాకిస్ధాన్, అమెరికాల సంబంధాలు చెడిపోయాయని ఇప్పటిదాకా బిబిసి, రాయిటర్స్, న్యూయార్క్ టైమ్స్ లాంటి పశ్చిమ కార్పొరేట్ పత్రికలు వాదిస్తూ వచ్చాయి. వాస్తవానికి ఒసామా బిన్ లాడెన్ హత్య కోసం అమెరికా హెలికాప్టర్లు పాక్ గగనతలంలోకి చొరబడడం పాకిస్ధాన్ కు తెలియకుండా జరగదనీ, పాక్, అమెరికాల సంబంధాలు చెడడానికి ఒసామా హత్య కారణం కాదనీ ఈ బ్లాగర్ రెండు మూడు…

అమెరికా ప్రత్యేక దళాలను దేశంనుండి పంపించిన పాక్ ప్రభుత్వం

మొత్తం మీద పాకిస్ధాన్ ప్రభుత్వం అనుకున్నది సాధించింది. పాక్ సైనికులకు శిక్షణ ఇచ్చే పేరుతో పాకిస్ధాన్ లో తిష్ట వేసిన అమెరికా ప్రత్యేక బలగాలను లేదా సి.ఐ.ఏ గూఢచారులను బాగా తగ్గించాలని పాక్ ప్రభుత్వం గత కొన్ని వారాలనుండి అమెరికాను కోరుతూ వచ్చింది. ఈ విషయమై ఇరు దేశాల మిలట్రీ ప్రతినిధుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. ఎట్టకేలకు పాకిస్ధాన్ లో ఉన్న సి.ఐ.ఏ గూఢచారుల్లో 90 మందిని అమెరికాకి తిప్పి పంపినట్లుగా పాక్ ప్రభుత్వం…

పాక్ సైన్యం నిజ స్వరూపం బట్టబయలు, డ్రోన్ దాడులకు పూర్తి మద్దతు

ఆఫ్ఘనిస్ధాన్‌లో దురాక్రమణ యుద్దం చేస్తున్న అమెరికా సైన్యం పాకిస్ధాన్ భూభాగంలో తలదాచుకుంటున్న తాలిబాన్ మిలిటెంట్లను అంతమొందించడానికి మానవ రహిత డ్రోన్ విమానాలను అధిక సంఖ్యలో వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ డ్రోన్ దాడులు పాకిస్ధాన్ సార్వభౌమత్వాన్ని ధిక్కరించడమేనని, కనుక వాటిని మేము అనుమతించబోమనీ పాకిస్ధాన్ సైన్యంతో పాటు, పాక్ ప్రభుత్వం కూడా అప్పుడప్పుడు ప్రకటనలు చేస్తాయి. అయితే వికీలీక్స్ బయట పెట్టిన డిప్లొమాటిక్స్ కేబుల్స్ ద్వారా వెల్లడైన సమాచారం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉండడం ఇప్పుడు తాజా…