రేపిస్టులను వదిలేస్తున్న భారత న్యాయ, సామాజిక వ్యవస్ధలు
రేపిస్టులు భారత దేశంలో కాలరెత్తుకు తిరుగుతున్నారు. అనేక సామాజిక అడ్డంకులు ఎదుర్కొని మరీ రేప్ నేరాలను రిపోర్టు చేస్తున్న బాధితులకు దక్కుతున్నది అవమానాలూ, నిరాశే తప్ప న్యాయం కాదు. 1973 నుండి ఇప్పటి వరకూ శిక్షలు పడిన రేపిస్టుల సంఖ్యలు చూస్తే రేప్ నేరాల్లో నేరం రుజువై శిక్ష పడిన కేసులు ప్రతి దశాబ్దానికి పడిపోతూ వచ్చినట్లు స్పష్టం అవుతోంది. రేప్ నేరాలలో పోలీసులు జరుపుతున్న పరిశోధనల్లో తీవ్రమైన లోపాలు, నిర్లక్ష్యం, తేలిక భావం చోటు చేసుకోవడం…
