రేడియేషన్ (అణు ధార్మికత) ఎంత తక్కువయితే సేఫ్?
జపాన్ లో ఫుకుషిమా అణు కర్మాగారంలో వినాశకర ప్రమాదం జరిగాక తరచుగా వినిపిస్తున్న మాట “రేడియేషన్ ఫలానా పరిమితి కంటే తక్కువగా ఉంది గనక ప్రమాదం లేదు” అని. అణు పరిశ్రమ యాజమాన్యాలు, వారికి వత్తాసుగా నిలిచే “voodoo” శాస్త్రవేత్తలు, ఎకాలజిస్టులు తరచుగా ఈ పదజాలాన్ని వల్లె వేస్తున్నారు. వాతావరణంలో సహజంగానే కొంత రేడియేషన్ ఉంటుందనీ, అసలు మానవ శరీరంలోనే కొంత రేడియేషన్ ఉంటుందనీ, కనుక ఫలానా పరిమాణం కంటే తక్కువ స్ధాయిలో రేడియేషన్ సోకినా ప్రమాదం…
